- Telugu News Photo Gallery Are you drinking Coconut water, if you have these problems, then do not drink it
కొబ్బరినీళ్లు తాగే అలవాటుందా..? ఈ సమస్యలున్న వారు అస్సలు తాగకూడదంట.. ఇక మీ ఇష్టం..
ప్రస్తుత కాలంలో ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈ తరుణంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.. ముఖ్యంగా ఎండాకాలంలో చాలామంది డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంటారు. వాస్తవానికి.. శరీరంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నీటిశాతం తగ్గితే.. అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Updated on: May 24, 2024 | 1:01 PM

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కిడ్నీలో రాళ్లు ఉంటే కొబ్బరి నీళ్లను క్రమం తప్పకుండా తాగాలని సూచిస్తున్నారు. మినరల్స్ అధికంగా ఉండే కొబ్బరి నీళ్లు కిడ్నీలో రాళ్లను కరిగించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి సహాయపడతాయి. కాబట్టి కిడ్నీలో రాళ్ల వల్ల మూత్ర సమస్యలున్న వారు కొబ్బరి నీళ్లను తాగడం అలవాటు చేసుకోవాలి.

కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు: కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

కొబ్బరి నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఫలితంగా మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అంతే కాకుండా డయేరియా వ్యాధిగ్రస్తులకు కూడా కొబ్బరి నీళ్లు ఎంతో మేలు చేస్తాయి. అతిసారం నివారణకు శరీరంలో నీరు, ఎలక్ట్రోలైట్ స్థాయిలు నిర్వహించడానికి కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా తాగాలి.

కొబ్బరి నీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడతాయి. అంటే శరీరంలో పేరుకుపోయిన హానికరమైన పదార్థాలను తొలగించడం ద్వారా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుందన్నమాట. ప్రతిరోజూ 1-2 కప్పుల కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండలో లేదా అధిక శారీరక శ్రమ చేసేవారు అధిక పరిమాణంలో తాగవచ్చు.

కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా కొబ్బరి నీళ్ల వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో అధిక స్థాయిలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.




