heels Crack: మడమలు పగిలి నొప్పిగా ఉన్నాయా.. ఇవి రాస్తే సరి!
చలికాలంలో వచ్చే సమస్యల్లో మడమలు పగిలిపోవడం కూడా ఒకటి. మడమలు పగిలిపోవడం వల్ల ఒక్కోసారి చాలా నొప్పిగా ఉంటుంది. ఈ నొప్పిని భరించడం కష్టం. నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది..
Updated on: Nov 22, 2024 | 6:12 PM

చలికాలం వచ్చిందంటే స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతాయి. చర్మం పగలిపోవడం, పొడిబారిపోవడం, తేమను కోల్పోవడం, చర్మం నిర్జీవంగా మారడం, కాళ్ల మడమలు పగలడం ఇలా ఒక్కటేంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఎటాక్ చేస్తాయి.

అదే విధంగా సీజనల్ వ్యాధులైన జ్వరం, జలుబు, దగ్గు వంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇలా వీటితో పాటు మడమలు కూడా పగులుతూ ఉంటాయి. ఒక్కోసారి మడమలు తీవ్రంగా పగిలి, చాలా నొప్పిగా ఉంటుంది. అందులోనూ బయట పని చేసేవారికి ఈ సమస్య మరింతగా ఉంటుంది.

మడమల పగుళ్లు వచ్చినప్పుడు క్లీనింగ్ చాలా ముఖ్యం దుమ్ము, ధూలి కారణంగా ఎక్కువగా మడమలు పగులుతాయి. కాబట్టి ఈ సీజన్‌లో కాళ్లను కూడా ఎక్కువగా క్లీన్ చేస్తూ ఉండాలి. దీని వల్ల పగుళ్లు పెద్దగా రావు. వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.

చల్లటి నీళ్లు వాడితే కాళ్లు మరింత డ్రై అయిపోతాయి. కాబట్టి చలి కాలంలో గోరు వెచ్చటి నీటిని ఉపయోగించండి. కాళ్లు కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ ఖచ్చితంగా అప్లై చేయాలి.

మాయిశ్చరైజర్ లేకపోతే ఇంట్లో ఉండే ఏదైనా నూనె రాసినా పర్వాలేదు. రాత్రి పూట పడుకునే ముందు మడమలకు నూనె పట్టించండి. ఇలా చేయడం వల్ల త్వరగా మెత్తబడతాయి. వాజెలిన్, తెనే రాసినా పర్వాలేదు.




