- Telugu News Photo Gallery Amla Powder, Coconut Oil: Best Natural Remedy to Reverse Grey Hair and Stop Hair Fall
ఖరీదైన హెయిర్‌డై వద్దు.. జస్ట్ ఈ పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాస్తే.. క్షణాల్లో తెల్ల జుట్టు మాయం..
ఈ మధ్య కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో తెల్ల జట్టు, జుట్టు రాలడం కూడా ఒకటి. చాలా మంది చిన్న వయస్సులోనే జుట్టు రాలిపోవడం, తెల్లబడడం వంటి సమస్యలను పేస్ చేస్తున్నారు. కొందరు ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఖరీదైన హెయిర్ డైస్, శాంపూస్ వంటివి వాడుతారు. కానీ వాటితో పూర్తి ప్రయోజనాలను పొందలేరు. అలాంటి వారి కోసమే ఈ వార్త.. మన ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతోనే ఈ సమస్యకు మనం చెక్ పెట్టవచ్చు. అదెలానో తెలుసుకుందాం పదండి.
Updated on: Nov 28, 2025 | 4:43 PM

అందమైన, మెరిసే జుట్టు కావాలని అందరూ కోరుకుంటారు. ఇందు కోసం చాలా మంది ఖరీదైన హెయిర్ డైస్ శాంపూలు వాడుతారు. కానీ మనం నిత్యం ఉపయోగించే కొబ్బరి నూనెకు కొద్దిగా ఆమ్లా పౌడర్( ఉసిరి పొడి)ని కలిపి ఆ పేస్ట్‌ను జుట్టుకు రాసుకోవడం ద్వారా మీరు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చు.

ఆమ్లాలో జుట్టుకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్లు E, K ఉంటాయి. ఆమ్లా పొడిని కొబ్బరి నూనెతో కలిపి పూయడం వల్ల తల చర్మం, జుట్టు మూలాలు బలపడతాయి.

ఇది జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. ఈ పొడిని జుట్టుకు రాయడం వల్ల జుట్టు త్వరగా , పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఇది జుట్టును నల్లగా మెరిసేలా చేస్తుంది.

ఉసిరి పొడి, కొబ్బరి నూనె రెండింటిలోనూ జుట్టు రాలడాన్ని నిరోధించే లక్షణాలు ఉన్నాయి. ఉసిరి పొడి జుట్టు మూలాలను బలపరుస్తుంది.. జుట్టు తెల్లగా మారడాన్ని తగ్గిస్తుంది.అలాగే జుట్టు పల్చబడటాన్ని నియంత్రిస్తుంది. ఆమ్లా, కొబ్బరి నూనె తలకు తేమను అందిస్తాయి, పొడిబారడం, చుండ్రు నుండి రక్షిస్తాయి. సూక్ష్మజీవుల వల్ల కలిగే ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి.

ఈ పేస్ట్ రెడీ చేసుకోవడం చాలా ఈజీ.. ఇందుకోసం మీరు ఉసిరి పొడిని.. కొద్దిగా వేడి చేసిన కొబ్బరి నూనెలో వేసి.. వెంట్రుకలకు అప్లై చేసుకొండి. కొద్ది సేపటి తర్వాత దాన్ని షాంపూ ఉపయోగించి కడిగేయండి. మీరు ఇలా క్రమం తప్పకుండా చేస్తే, మీ జుట్టు బలంగా మారడంతో పాటు నల్లగా మెరిసేదిగా మారుతుంది. ( పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించట్లేదు)




