- Telugu News Photo Gallery Cinema photos Raju Weds Rambai Fame Tejaswi Rao Intresting Comments About Her First Kiss
Raju Weds Rambai: అతడితోనే నా ఫస్ట్ కిస్.. అది ఒక క్యూట్ మూమెంట్.. రాజు వెడ్స్ రాంబాయి హీరోయిన్..
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో సత్తా చాటుతుంది. ఇందులో కథానాయికగా నటించి అందరి దృష్టిని ఆకర్షించింది తేజస్వి రావు. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అట్రాక్షన్ హీరోయిన్గా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
Updated on: Nov 28, 2025 | 3:31 PM

రాజు వెడ్స్ రాంబాయి.. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా. ఇందులో రాంబాయి పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన హీరోయిన్ తేజస్వి రావు. సహజ సౌందర్యం.. అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవలే కమిటీ కుర్రోళ్లు సినిమాలో మెప్పించింది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో మరోసారి అందర్నీ అలరించింది. అంతకు ముందు షార్ట్ ఫిల్మ్స్, రీల్స్ ద్వారా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది సెస్సేషన్ అయ్యింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని.. తన ఫస్ట్ కిస్ గురించి చెప్పింది. ఫస్ట్ క్లాస్ లో తన పక్కన కూర్చొన్న అబ్బాయి ఎరేజర్ కింద పడేశాడని.. అది తీయమని తనను అడిగాడని.. ఎరేజర్ తీద్దామని బెంచ్ కిందకు దిగానని.. అప్పుడు అతడు సైతం బెంచ్ కిందకు వచ్చి బుగ్గ మీద కిస్ చేశాడని తెలిపింది.

అప్పుడు అది క్యూట్ మూమోంట్ అని.. అప్పటికీ అది కిస్ అని కూడా తనకు తెలియదని తెలిపింది. ప్రస్తుతం తేజస్వి రావు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. నెటిజన్స్ భిన్నంగా రియాక్ట్ అవుతున్నారు. అసలు ఫస్ట్ క్లాస్ లోనే ఇలాంటి ఘటన జరిగిందా.. ? అది ఇంకా గుర్తుందా అంటూ రియాక్ట్ అవుతున్నారు.

తేజస్వి రావు.. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మాయి.. కమిటీ కుర్రోళ్లు సినిమాతో వెండితెరపై సందడి చేసింది. ఇప్పుడు రాజు వెడ్స్ రాంబాయి సినిమాతో కథానాయికగా ప్రశంసలు అందుకుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.




