Amazon Summer Sale: ఇకామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ మే 4వ తేదీ నుండి సేల్ నిర్వహించనుంది. ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైన ఒక రోజు తర్వాత ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ అమెజాన్ సేల్ సమయంలో స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, టీవీలు, గృహోపకరణాలు, ఏసీల వరకు భారీ తగ్గింపులు ఉండనున్నాయి. కంపెనీ ఈసారి కౌంట్‌డౌన్ డీల్‌లను అందించనుంది. దీని సహాయంతో వినియోగదారులు Apple, Samsung, Oppo, Boat, Noise Fosil, Fastrack, Timex మొదలైన కొన్ని రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను పొందుతారు.