AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: శుభలేఖలందు ఈ శుభలేఖ వేరయా.. పవన్ కల్యాణ్ పై ఎనలేని అభిమానం.. నెట్టింట ఫొటో వైరల్

పవన్ కల్యాణ్(Pawan Kalyan).. పరిచయం అక్కర్లేని పేరు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు. అంతేకాదు అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా...

Janasena: శుభలేఖలందు ఈ శుభలేఖ వేరయా.. పవన్ కల్యాణ్ పై ఎనలేని అభిమానం.. నెట్టింట ఫొటో వైరల్
Marriage
Ganesh Mudavath
|

Updated on: May 02, 2022 | 5:12 PM

Share

పవన్ కల్యాణ్(Pawan Kalyan).. పరిచయం అక్కర్లేని పేరు. అటు సినిమాల్లో, ఇటు రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్నారు. అంతేకాదు అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా చాలా మంది అభిమానులు తమకు ఇష్టమైన హీరోలపై వివిధ రూపాల్లో అభిమానాన్ని చాటుతుంటారు. తాజాగా తూర్పుగోదావరి(East Godavari) జిల్లా కొవ్వూరుకు చెందిన హరీశ్ బాబు పవన్ కల్యాణ్ సారధ్యం వహిస్తున్న జనసేన పార్టీపై వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. జనసేన(Janasena) లీగల్ సెల్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్న హరీశ్ బాబు వివాహం ఈ నెల 4న జరగనుంది. ఈ సందర్భంగా హరీశ్ బాబు తన వివాహ శుభలేఖలో పైభాగంలో జనసేన పార్టీ మేనిఫెస్టో, గుర్తు, పవన్ కల్యాణ్ ఫొటోలను ముద్రించారు. శుభలేఖ కింది భాగంలో పెళ్లి ముహూర్తం వివరాలను తెలియజేశారు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన సిద్ధాంతాలు తనకు ప్రేరణ కలిగించాయని హరీశ్ బాబు చెప్పారు. జనసేన మేనిఫెస్టోతో ముద్రించిన ఈ శుభలేఖ పవన్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Janasena Wedding Card

Janasena Wedding Card

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇవీచదవండి

Dogs Fight: పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న కుక్కలు.. చూస్తే అవాక్కే..! వీడియో చూస్తే ఫ్యూజులు ఔటే..

Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ అంటే ఏమిటి?.. బంగారం కొనడం మాత్రమేనా?