- Telugu News Photo Gallery Amazing Health benefits of Jackfruit Seeds, Check here is details in Telugu
Jackfruit Seeds: ఈ గింజలను పడేస్తున్నారా.. ఇకపై అలా అస్సలు చేయకండి!
చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. పనస పండు ఎంతో రుచిగా ఉంటుంది. పనస కాయలోని ప్రతీ భాగం కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. పనస పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఎక్కువగా పనస తొనలను తింటూ ఉంటారు. అందులోని సీడ్స్ మాత్రం పడేస్తూ ఉంటారు. కానీ ఈ పనసు గింజల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ గింజలను వేయించి లేదా ఉడకబెట్టి..
Updated on: Jun 07, 2024 | 1:54 PM

చాలా మంది ఇష్టంగా తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. పనస పండు ఎంతో రుచిగా ఉంటుంది. పనస కాయలోని ప్రతీ భాగం కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటుంది. పనస పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే ఎక్కువగా పనస తొనలను తింటూ ఉంటారు. అందులోని సీడ్స్ మాత్రం పడేస్తూ ఉంటారు.

కానీ ఈ పనసు గింజల్లో కూడా ఎన్నో రకాల పోషకాలు నిండి ఉన్నాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా అందుతాయి. ఈ గింజలను వేయించి లేదా ఉడకబెట్టి తీసుకోవాలి. పచ్చివి అస్సలు తీసుకోకూడదు.

పనస గింజలు తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గించి.. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అలాగే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి.. ఇన్ ఫెక్షన్ల బారిన పడకుండా ఉంచుతుంది. ఇవి తినడం వల్ల ఎముకలు, దంతాలు కూడా బలంగా, దృఢంగా ఉంటాయి.

బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్‌ను కూడా అదుపులో ఉంచడంలో ఇవి చక్కగా పని చేస్తాయి. శరీరంలో పేరుకు పోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఈ గింజలు చక్కగా పని చేస్తాయి. అదే విధంగా గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి.

శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అంతే కాకుండా క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించి.. హెల్ప్ చేస్తాయి. జీర్ణ వ్యవస్థను కూడా మెరుగు పరుస్తాయి. అయితే రక్తానికి సంబంధించిన మందులను వాడే వారు ఈ గింజలను తీసుకోకూడదు.





























