- Telugu News Photo Gallery Ajwain Seeds Boiling in hot water and drinking it can relieve many digestive diseases
Ajwain Seeds: వారెవ్వా.. వాముతో ఇన్ని ప్రయోజనాలా.. తెలిస్తే అస్సలు వదలరు..
ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులతో పనులు చక్కబెట్టుకుంటూ ముందుకుసాగుతారు. పని ధ్యాసలో పడి ఆరోగ్యం కాపాడుకోవడంలో అశ్రద్ద చూపిస్తారు. ఏది పడితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతోంది. పైగా వ్యాధినిరోధక శక్తి అనేదానిని అసలు మరిచిపోయారు ప్రజలు. ఏదైనా చిన్నపాటి అనారోగ్యం దరిచేరినా వైద్యులను సంప్రదిస్తున్నారు.
Updated on: May 30, 2024 | 9:45 PM

ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులతో పనులు చక్కబెట్టుకుంటూ ముందుకుసాగుతారు. పని ధ్యాసలో పడి ఆరోగ్యం కాపాడుకోవడంలో అశ్రద్ద చూపిస్తారు. ఏది పడితే అది తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఈ క్రమంలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు కొని తెచ్చుకుంటున్నారు. దీని వల్ల శరీరంలో శక్తి తగ్గిపోతోంది. పైగా వ్యాధినిరోధక శక్తి అనేదానిని అసలు మరిచిపోయారు ప్రజలు.

ఏదైనా చిన్నపాటి అనారోగ్యం దరిచేరినా వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా చెప్పాలంటే కడుపు నొప్పి, తలనొప్పి, జలుబు లాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు కూడా డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. అయితే మన వంట ఇంట్లో ఉండే కొన్ని పదార్ధాల ద్వారా మన ఆరోగ్యాన్ని ఇట్టే కాపాడుకోవచ్చు. ముఖ్యంగా మహిళలు నెలసరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

రుతుక్రమంలో మహిళలకు తరుచూ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో వాము మంచి ఆయుర్వేద మెడిసిన్ గా పనిచేస్తుంది. ఒక గ్లాసు నీళ్లు తీసుకుని అందులో ఒక అర స్పూన్ వాము వేసి బాగా మరగబెట్టి ఆ నీటిని మెల్లగా సేవిస్తే చాలు కడుపు నొప్పి తగ్గిపోతుంది. అంతే కాకుండా అనేక అనారోగ్య సమస్యలకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.

ముఖ్యంగా వేసవిలో వామును తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు అందడంతో పాటూ బరువు కూడా తగ్గుతారు. ఒంట్లోని చెడు కొవ్వును బయటకు పంపించడంలో సహాయకారిగా పని చేస్తుంది. అలాగే మలబద్దకం సమస్యలను ఇట్టే వదిలిస్తుంది. పైగా అధికంగా తినడం వల్ల కడుపు ఉబ్బసంగా అనిపిస్తుంది.

ఈ సమయంలో కూడా వామును నేరుగా చిటికెడు నోట్లో వేసుకుని నమలి ఆ రసాన్ని మింగడం వల్ల అజీర్తి తగ్గుతుంది. ఇలా కష్టం అనిపిస్తే గోరువెచ్చని నీటిలో వాము పొడి కలిపి సేవించవచ్చు. ఇలా ఎక్కడికో పరుగులు పెట్టకుండా వంటింటినే వైద్యశాలగా ఉపయోగించుకుని సహజంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.




