పప్పుధాన్యాలు ప్రధానంగా బీహార్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, తూర్పు కర్ణాటకలో పండిస్తారు. అంతేకాకుండా పాలిష్ చేసిన పప్పులను మయన్మార్, కెనడా నుంచి దిగుమతి చేసుకుంటారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యవసాయ భూముల పరిమాణం తగ్గడం, అధిక వర్షాల కారణంగా పప్పుధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది.