- Telugu News Photo Gallery Add these vitamin E rich five foods in your diet for glowing skin in Telugu
Beauty tips: మెరిసే చర్మం కోసం.. విటమిన్- ఇ ఉన్న ఈ ఆహార పదార్థాలను తీసుకోండి..
Vitamin E rich foods: చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా, లోపల నుండి ఆరోగ్యంగా ఉంచడం సులభం. ఇందుకోసం బ్యూటీ రొటీన్ కాకుండా సరైన డైట్ రొటీన్ పాటించాలి. ఇందుకోసం విటమిన్-ఇ పుష్కలంగా ఉన్న ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి.
Updated on: Mar 19, 2022 | 6:07 PM

బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడుకు పదును పెట్టడమే కాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హానికరమైన UV కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి.

బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంలోని ఫ్రీ ర్యాడికల్స్ తో పోరాడుతాయి. తద్వారా ముఖానికి మెరుపునను తీసుకొస్తాయి. అంతేకాదు బ్రోకలీని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.

క్యారెట్లలో విటమిన్లు-ఇ, సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణలో బాగా దోహదపడతాయి. దీనిని కూరగాయలు, సలాడ్లు, లేదా స్మూతీల రూపంలో తీసుకోవచ్చు.

చర్మ సంరక్షణలో పొద్దుతిరుగుడు విత్తనాలకు ప్రత్యేక స్థానముంది. వీటిని తీసుకోవడం వల్ల విటమిన్-ఇ లోపం సమస్యలు దూరమవుతాయి. ఇందులోని పోషకాలు చర్మానికి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. అయితే వీటిని ఎలా? ఎంత పరిమాణంలో తీసుకోవాలి? అనే విషయాలను ముందుగా వైద్య నిపుణుల సలహాలను అడిగితీసుకోవాలి.

మెరిసే చర్మం సొంతం చేసుకోవాలంటే విటమిన్- ఇ సమృద్ధిగా దొరికే ఆహార పదార్థాలను పుష్కలంగా తీసుకోవాలి.

వాల్‌నట్స్ లో విటమిన్ ఇతో పాటు చర్మానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా చర్మ సంరక్షణలో ఎఫెక్టివ్ గా భావించే బయోటిన్ ప్రొటీన్ వాల్ నట్స్ లో సమృద్ధిగా లభిస్తుంది. కాబట్టి ప్రతిరోజూ నానబెట్టిన వాల్‌నట్ గింజలను తీసుకుంటే చర్మం ఆరోగ్యానికి ఎంతో మంచిది.




