- Telugu News Photo Gallery According to your date of birth, it will be lucky if you bring these items home on Diwali
దీపావళి వచ్చేస్తుంది.. మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ వస్తువులు ఇంటికి తెస్తే అంతా శుభమే!
చిన్ని పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఇష్టమైన దీపావళి పండుగ వచ్చేస్తుంది. చాలా పవిత్రమైన పండుగలలో ఇదొక్కటి. ఈ రోజున లక్ష్మీదేవి పూజ చేస్తారు. ముఖ్యంగా ఇంటికి కొత్త వస్తవులు తెచ్చుకుంటారు. ఈ రోజు కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేయడం వలన కలిసి వస్తుందటున్నారు పండితులు. అయితే ఏ తేదీన పుట్టిన వారు ఏ వస్తువును ఇంటికి తీసుకొస్తే అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.
Updated on: Oct 13, 2025 | 9:45 AM

ఏ వ్యక్తులు అయితే ఒకటవ తేదీ రోజున జన్మిస్తారో వారు దీపావళి పండుగ రోజున సూర్యుడి చిత్రపటం లేదా మీ చూపుడు వేలుకు బంగారు ఉంగరాన్ని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదంట. దీని వలన అదృష్టం కలిసి వస్తుందంటున్నారు పండితులు.

నెల ఏదైనా సరే రెండవ తేదీన జన్మించిన వారు తమ ఇంటిలోనికి వాటర్ ఫౌంటెన్ తీసుకరావడం చాలా మంచిదంట. దీని వలన మీ ఇంట్లో సంపద పెరగడమే కాకుండా ,ఆర్థికం, ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు చేకూరుతాయంట.

మూడవ తేదీన జన్మించిన వారు దీపావళి పండుగ రోజున తప్పకుండా పసుపు లేదా విష్ణుమూర్తి విగ్రహాన్ని కొనుగోలు చేసి తమ ఇంటిలోని తీసుకొచ్చుకోవడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయంట.

నాలుగోవ తేదీన జన్మించిన వారు దీపావళి పండుగ సమయంలో తమ ఇంటికి వెండితో తయారు చేసిన ఏనుగు విగ్రహాన్ని తీసుకరావడం వలన పనుల్లో అడ్డంకులు తొలిగిపోతాయి. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ధనలాభం కలుగుతుందంట.

ఐదవ తేదీన జన్మించిన వారు గణేశుడి విగ్రహాన్ని దీపావళి పండుగ రోజున ఇంటిలోని తెచ్చుకోవడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయంటున్నారు పండితులు.



