- Telugu News Photo Gallery According to Baba Vanga astrology, these zodiac signs will be lucky in the month of Shravan
బాబా వంగా జ్యోతిష్య : శ్రావణ మాసంలో ఈ రాశులకు లక్కేలక్కు!
బాబా వంగా ప్రముఖ జ్యోతిష్యుడు, ఈయన ముందే జరిగే అనేక సంఘటనల గురించి తెలియజేయడం జరిగింది. అయితే బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం, శ్రావణ మాసంలో నాలుగు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
Updated on: Jul 26, 2025 | 8:26 PM

బల్గేరియాకు చెందిన బాబా వంగా అంచనాలపై ఇప్పటికీ చర్చజరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈమె భవిష్యత్తులో జరిగే కొన్ని సంఘటనల గురించే ముందే తెలిపింది. వాటిలో చాలా వరకు నిజం అయ్యాయి. అయితే ఈ క్రమంలోనే బాబా వంగాకు సంబంధించిన జ్యోతిష్యం ప్రకారం శ్రావణ మాసంలో నాలుగు రాశుల వారు లక్షాధికారులు అవుతారంట. వారు ఎవరంటే?

సింహ రాశి : ఈ రాశి వారు ఆర్థికంగా బలపడతారంట. వీరు ఈ మాసంలో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చెబుతుంది బాబా వంగా జ్యోతిష్యం. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు. సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పదోన్నతి లభించే అవకాశం ఉందంట.

మేష రాశి :బాబా వంగా జ్యోతిష్యం ప్రకారం మేష రాశి వారికి శ్రావణ మాసం ధనలాభం తీసుకొస్తుందంట. ఈ రాశి వారికి న్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంట్లో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. విద్యార్థులకు, వ్యాపారస్తులకు కలిసి వస్తుంది.

తుల రాశి : తుల రాశి వారికి శ్రావణ మాసంలో పట్టిందల్లా బంగారమే కానున్నదంట. వీరు ఏ పని చేపట్టినా అందులో విజయం సాధిస్తారంట. అంతేకాకుండా వీరికి ఆర్థికంగా కలిసివస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది.

ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి శ్రావణ మాసంలో అదృష్టం కలిసి వస్తుంది. వీరు ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంది. ధన లాభం కలుగు తుంది. కోర్టు కేసులు వీరికి అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషక వాతావరణం ఏర్పడుతుంది. అడ్డంకులు తొలిగిపోతాయి.



