AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hotel: ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేస్తున్నారా.. ఈ 5 తప్పులు చేస్తే తిప్పలు తప్పవు..

నేటి డిజిటల్ యుగంలో ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకోవడం చాలా ఈజీ. సమయం కూడా ఆదా అవుతుంది. కానీ దీన్ని వెనుక కొన్ని ప్రమాదాలు దాగి ఉన్నాయి. ఆన్‌లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు కొన్నిసార్లు మిమ్మల్ని తప్పుదారి పట్టించవచ్చు. చాలా మంది ప్రయాణీకులు హోటల్ బుకింగ్ సమయంలో చేసే సాధారణ తప్పులు ఏంటో..? వాటిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

Krishna S
|

Updated on: Oct 12, 2025 | 9:27 PM

Share
గుడ్డిగా నమ్మడం: ఆన్‌లైన్‌లో హోటల్ గదికి సంబంధించిన ఆకర్షణీయమైన, అందమైన ఫోటోలు చూపిస్తారు. అయితే ఈ ఫోటోలు తరచుగా తప్పుదారి పట్టించేవిగా ఉండవచ్చు. గది వాస్తవంగా చిన్నగా, శుభ్రత లేనిదిగా లేదా పాతదిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఫోటోలను మాత్రమే చూసి బుక్ చేయకుండా నిజమైన కస్టమర్ రివ్యూలు, రేటింగ్‌లను కూడా తప్పక చెక్ చేయాలి.

1 / 5
రూల్స్ చదవకపోవడం: చాలా మంది ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటప్పుడు నిబంధనలు, షరతులు అస్సలు చదవరు. క్యాన్సిలేషన్ ఫీజు, రిఫండ్ పాలసీ, చెల్లింపు నియమాలు వంటి ముఖ్యమైన విషయాలు ఈ నిబంధనల్లో ఉంటాయి. వీటిని చదవకపోతే తర్వాత ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు పెద్ద నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

2 / 5
హోటల్ ప్లేస్: ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో హోటల్‌ను ముఖ్యమైన ప్రదేశంలో లేదా టూరిస్ట్ స్పాట్‌కు దగ్గరగా ఉన్నట్లు చూపిస్తారు. కానీ వాస్తవ స్థానం చాలా దూరంగా లేదా రద్దీగా ఉండే ప్రదేశంలో ఉండవచ్చు. అందుకే బుక్ చేసుకునే ముందు గూగుల్ మ్యాప్స్‌లో హోటల్ యొక్క సరైన స్థానాన్ని సమీప ప్రాంతాలను తప్పక చెక్ చేయండి.

3 / 5
ధరలను పోల్చకపోవడం: చాలా మంది ఒకే ప్లాట్‌ఫామ్‌లో చూపించిన రేటును నమ్మి బుక్ చేస్తారు. కానీ ఒకే హోటల్‌కు వేర్వేరు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు వేర్వేరు రేట్లను కలిగి ఉండవచ్చు. కొన్నిసార్లు హోటల్ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా తక్కువ ధర దొరకవచ్చు. కాబట్టి బుకింగ్ చేసే ముందు కనీసం 2-3 ప్లాట్‌ఫామ్‌లలో రేట్లను పోల్చడం ద్వారా మోసపోకుండా డబ్బు ఆదా చేసుకోవచ్చు.

4 / 5
ఆఫర్ల పేరుతో మోసం: ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసేటప్పుడు భారీ డిస్కౌంట్లు లేదా అసాధారణమైన ఆఫర్ల పేరుతో మోసం జరిగే అవకాశం ఉంది. హోటల్ రేటు లేదా ఆఫర్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఆ ప్లాట్‌ఫామ్ నిజమైనదా కాదా అని ఒకటికి రెండుసార్లు క్రాస్-చెక్ చేసుకోవడం ఉత్తమం.

5 / 5