Safest Cities in India: దేశంలోని టాప్ 10 సురక్షిత నగరాలు ఇవే.. హైదరాబాద్ ఎక్కడుంది?
నంబియో సేఫ్టీ ఇండెక్స్ అనే సంస్థ తాజాగా 2025 సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సురక్షితమైన దేశాలు, నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో భారత్‌కు చెందిన 10 నగరాలు సురక్షితమైన నగరాల జాబితాలో చోటుదక్కించుకున్నాయి. అయితే ఆ జాబితాలో ఏఏ నగరాలు ఉన్నాయి, అందులో మన హైదరాబాద్ ఉందో, లేదో ఇప్పుడు తెలుసుకుందా పదండి.
Updated on: Aug 08, 2025 | 5:01 PM

నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన భారత్‌లోనే టాప్-10 సురక్షితమైన నగరాల జాబితాలో కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు తొలి స్థానాన్ని దక్కించుకుంది. ఇక రెండో స్థానంలో గుజరాత్‌లోని వడోదర నిలిచింది. అయితే ఈ టాప్ 10 జాబితాలో హైదరాబాద్‌కు మాత్రం చోటు దక్కలేదు.

ఇక సురక్షితమైన నగరాల జాబితాలో అహ్మదాబాద్ మూడోవ స్థానంలో నిలవగా, అదేరాష్ట్రానికి చెందిన సూరత్ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

ఇక ఈ జాబితాలో రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ ఐదో స్థానంలో నిలవగా, మహారాష్ట్ర రాజధాని అయిన నవీ ముంబై ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇక దేశంలో అత్యంత సురక్షితమైన నగరాల్లో ఏడో స్థానంలో కేరళ రాజధాని తిరువనంతపురం చోటుదక్కించుకోగా, తమిళనాడు రాజధాని చెన్నై ఎనిమిదో స్థానంలో నిలిచింది.

ఇక ఈ సురక్షితమైన నగరాల జాబితాలో మహారాష్ట్రలోని పూణె తొమ్మిదో స్థానాన్ని కౌవసం చేసుకోగా, చండీఘడ్ 10వ స్థానంలో నిలిచింది. ఇక భారత రాజధాని ఢిల్లీ మాత్రం చిట్టచివరి స్థానంలో ఉండిపోయింది.

ఇక నంబియో సేఫ్టీ ఇండెక్స్ విడుదల చేసిన ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్ లో ఇండియా 55.8 స్కోరును సాధించింది.




