AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nonuplets: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. తొమ్మిది మంది.. పిల్లలను కన్న మహాతల్లి ఎక్కడో తెలుసుకోవాలనుందా?

Mali Woman Delivered Nonuplets: సాధారణంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మ నిస్తేనే కొంచెం కవల పిల్లలు అంటూ ఆసక్తిగా చూస్తాం. ఒక్కోసారి ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారంటే ఆశ్చర్యపోతాం..

Nonuplets: ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. తొమ్మిది మంది.. పిల్లలను కన్న మహాతల్లి ఎక్కడో తెలుసుకోవాలనుందా?
Mali Woman Delivered Nonuplets
KVD Varma
|

Updated on: May 05, 2021 | 11:13 AM

Share

Nonuplets:  సాధారణంగా ఒక మహిళ ఇద్దరు పిల్లలకు జన్మ నిస్తేనే కొంచెం కవల పిల్లలు అంటూ ఆసక్తిగా చూస్తాం. ఒక్కోసారి ముగ్గురు పిల్లలు ఒకేసారి పుట్టారంటే ఆశ్చర్యపోతాం.. చాలా అరుదుగా నలుగురు పిల్లలను ఒక మహిళ కన్నది అని తెలిస్తే.. నోరెళ్ళబెట్టాల్సి వస్తుంది. కానీ, ఒక మహిళ ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా తొమ్మిది మంది పిల్లలకు జన్మను ప్రసాదించింది. ఈ సంఘటన మాలి దేశంలో చోటు చేసుకుంది. డాక్టర్లే ఆశ్చర్యపోయేలా చేసిన ఈ సంఘటన గురించి తెల్సిన ఆ దేశ ప్రభుత్వమూ ఆశ్చర్యపోయి ఆ తల్లికి.. ఆమెకు వైద్యం చేసి పురుడుపోసిన డాక్టర్లకు శుభాభినందనలు తెలిపింది.

మాలి దేశానికి చెందిన ఒక మహిళ మొరాకోలో నాన్‌ప్లెట్స్‌(అంటే తొమ్మిది పిండాలు ఒకే గర్భంలో) కి జన్మనిచ్చింది. తొమ్మిది మంది పిల్లలు బాగానే ఉన్నారని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ అరుదైన కేసు వివరాలను మొరాకో ప్రభుత్వం వెల్లడించింది.

మాలి కి చెందిన హలీమా సిస్సే (25) డెలివరీ కోసం మొరాకోకు వెళ్లారు, అక్కడ ఆమె మే 4, మంగళవారం తొమ్మిది మంది బిడ్డలకు జన్మనిచ్చింది. పేద పశ్చిమ ఆఫ్రికా రాష్ట్రానికి ఉత్తరాన మాలిలో ఉంటున్న హలీమా సిస్సే తొమ్మిది మందిని తన గర్భంలో మోస్తున్నట్టు వైద్యులు తెలుసుకున్నారు. దీంతో ఆమెను మెరుగైన వైద్యం కోసం.. మొరాకో పంపించారు. ఆమెకు మొత్తం 9 మంది పిల్లలు (ఐదుగురు బాలికలు, నలుగురు అబ్బాయిలు) జన్మించారు. వైద్యులు ఆమెకు సిజేరియన్ ఆపరేషన్ చేయడం ద్వారా పిల్లలను సురక్షితంగా ఉంచగలిగారు. తల్లీ, పిల్లలూ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారనీ..త్వరలోనే వారు తమ ప్రాంతానికి వెళతారని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. చాలా..చాలా అరుదుగా మాత్రమే మహిళలు ఏడుగురు పిల్లలకు జన్మ ఇవ్వగలరు. తొమ్మిది మందికి జన్మ ఇవ్వడం అనేది ఇది మూడోసారి మాత్రమే.

తొలిసారిగా 1971 లో, ఆస్ట్రేలియాకు చెందిన జెరాల్డిన్ బ్రోడ్రిక్, సిడ్నీలో నాన్‌ప్లెట్స్‌కు జన్మనిచ్చింది. తొమ్మిది మంది శిశువులలో ఏడుగురు సజీవంగా జన్మించారు. దురదృష్టవశాత్తు, బ్రోడ్రిక్ నాన్‌ప్లెట్స్‌లో ఎవరూ పుట్టిన ఆరు రోజుల కన్నా ఎక్కువ కాలం జీవించలేదు.

తరువాత 1999 మార్చి 26న జురీనా అనే ఆమె మలేసియాలో ఐదుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. అయితే, పాపం వారంతా పుట్టిన ఆరుగంటలలోనే మరణించారు.

ఈ సంఘటనపై మొరాకో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి రచిద్ కౌదరి మాట్లాడుతూ, తనకు తెలిసినంతవరకు దేశ ఆసుపత్రులలో బహుళ జననాలు జరగలేదు. ఇది చాలా సంతోషంగా ఉంది. తల్లీ పిల్లలు క్షేమంగా ఉండటం ఆనందాన్ని ఇస్తోంది అని తెలిపారు.

Also Read: Tablet Vaccine: ఇక కరోనా టీకా ఇంజక్షన్ మర్చిపోండి..మాత్రలు..నాజల్ డ్రాప్స్ తో కోవిడ్ ను గెలిచేందుకు కంపెనీలు సిద్ధం!

Microsoft and Yahoo: మైక్రోసాఫ్ట్ యాహూల మధ్య కుదిరిన ఒప్పందం..గూగుల్ ఆధిపత్యానికి సవాల్..