King Cobra: ఇంట్లోకి వచ్చిన కింగ్ కోబ్రా.. కిటికీలోంచి దూకిన భర్త.. మరి భార్య ఏం చేసిందంటే..
king cobra rescued by woman: మహిళలు చిన్న బొద్దింకను చూస్తే హడలిపోతరని అంతా అనుకుంటారు. కానీ, ఈ మహిళ గురించి తెలిస్తే మాత్రం...
King Cobra: మహిళలు చిన్న బొద్దింకను చూస్తే హడలిపోతరని అంతా అనుకుంటారు. కానీ, ఈ మహిళ గురించి తెలిస్తే మాత్రం కచ్చితంగా నోరెళ్ల పెడతారు. ఓ మహిళ తన ఇంట్లోకి దూరిన ఎనిమిది అడుగుల కింగ్ కోబ్రాను అలవోకగా పట్టుకుంది. అయితే, దానికి ఆమె హానీ తలపెట్టకుండా సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేసింది. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది.
ఘటన తాలూకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో అకిల్ ముండా, సాస్మైట్ గోచైట్ దంపతలు జీవనం సాగిస్తున్నారు. వీరికి రెండేళ్ల కొడుకు ఉన్నాడు. అయితే సాయంత్రం సమయంలో ఇంట్లోకి ఎనిమిది అడుగుల కింగ్ కోబ్రా వచ్చింది. దానికి చూసి పిల్లవాడు.. ఆ కోబ్రా వైపు వడివడిగా అడుగు వేయడం స్టార్ట్ చేశాడు. అంతలోనే ఆ పామును, పిల్లవాడు అటుగా వెళ్లడాన్ని గమనించిన అఖిల్ ముండా.. క్షణాల వ్యవధిలో ఆ చిన్నారిని అడ్డుకుని ఇంట్లోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం చేరవేశాడు. గ్రామస్తుల సహాయం కూడా తీసుకున్నాడు.
అయితే, అప్పటికీ ఇంట్లోనే ఉన్న సాస్మైట్.. ఆ కోబ్రాను పట్టుకుని ఒక బస్తాలో బందించింది. ఆ వెంటనే రేంజ్ ఆఫీసర్ కృష్ణ గోచైట్‌కు కాల్ చేసి జరిగిన విషయం చెప్పారు. ఫారెస్ట్ ఆఫీసర్లు, గ్రామస్తులు అఖిల్ ఇంటికి వచ్చారు. బంధించిన పామును సురక్షిత ప్రాంతంలో వదిలేశారు అధికారులు. కాగా, ఇంట్లోకి వచ్చిన కింగ్ కోబ్రాను అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి పట్టుకున్న సాస్మైట్ గోచైట్‌ను అధికారులు, గ్రామస్తులు అభినందించారు.
A toddler life save by the women name Sasmita Gochhait with her husband krishna who rescues a 8 feet long King #kobra in #mayurbhanj of #Odisha. pic.twitter.com/eOLQk8oqCz
— Mohd Lateef Babla (@lateefbabla) June 6, 2021
Also read:
Coronavirus: కరోనాతో మృతి చెందిన తండ్రికి అంత్యక్రియలు చేయని కొడుకు.. చివరకు భార్యే