AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Woman Get Wallet: ఊహించని ట్విస్ట్.. 46 సంవత్సరాల క్రితం పొగొట్టుకున్న పర్స్ ఇప్పుడు దొరికింది.. అందులోని ఉన్నవి చూసి..

Woman Get Wallet: దాదాపు 46 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న ఓ మహిళ పర్స్ తిరిగి దొరికింది. ఆ పర్స్‌ని తెరిచి చూడగా.. అప్పుడు అందులో...

Woman Get Wallet: ఊహించని ట్విస్ట్.. 46 సంవత్సరాల క్రితం పొగొట్టుకున్న పర్స్ ఇప్పుడు దొరికింది.. అందులోని ఉన్నవి చూసి..
Purse
Shiva Prajapati
| Edited By: Phani CH|

Updated on: Jun 08, 2021 | 9:31 AM

Share

Woman Get Wallet: దాదాపు 46 సంవత్సరాల క్రితం పోగొట్టుకున్న ఓ మహిళ పర్స్ తిరిగి దొరికింది. ఆ పర్స్‌ని తెరిచి చూడగా.. అప్పుడు అందులో పెట్టిన వస్తువులన్నీ యధావిధిగా అందులోనే ఉన్నాయి. అది చూసి మహిళ సహా.. పర్స్ దొరికిన వారు షాక్ అయ్యారు. 1975 నాటి పర్స్‌ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో చోటు చేసుకుంది.

సాధారణంగా మనకు సంబంధించిన ఏదైనా వస్తువు, మరేదైన పోతే.. కొన్నాళ్ల తరువాత ఆటోమేటిక్‌గా మార్చిపోతాం. దాదాపుగా దాని గురించి ఆలోచించడమే మరిచిపోతాం. అలాంటి తమనకు సంబంధించిన పర్స్ పోయి.. 46 ఏళ్ల తరువాత దొరికితే రియాక్షన్ ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఆ మహిళదీ అదే పరిస్థితి. పోయిన పర్స్ మళ్లీ దొరుకుతుంది ఆమె కలలో కూడా ఊహించలేదు. పైగా 46 ఏళ్లు అవుతున్నా పర్స్ యధావిధిగా ఉండటం షాకింగ్ విషయం.

పూర్తి వివరాలు పరిశీలిస్తే.. కాలిఫోర్నియాలోని వెంచురా కు చెందిన ఓ మహిళ వ్యాలెట్ 1975 లో పోయింది. అప్పుడు దాని కోసం ఎంత వెతికినా దొరకలేదు. అయితే, ఆ పోయిన వాలెట్ ఇప్పుడు దొరికింది. అసలేం జరిగిందంటే.. వెంచురాలో నివసిస్తున్న ఒక మహిళ థియేటర్‌కు వెళ్లింది. అలా థియేటర్‌కు వెళ్లిన సమయంలోనే వ్యాలెట్ మిస్ అయ్యింది. పోయిన వ్యాలెట్ గురించి ఆమె పెద్దగా పట్టించుకోలేదు. కాలం గడిచిపోయినా కొద్ది ఆమె దాని గురించి పూర్తిగా మర్చిపోయింది.

అయితే, తాజాగా దక్షిణ కాలిఫోర్నియాలోని చారిత్రాత్మక మెజెస్టిక్ వెంచురా థియేటర్ వద్ద శానిటైజేషన్ వర్కర్స్ క్లీన్ చేస్తుండగా.. మహిళకు సంబంధించిన పర్స్ చెత్తలో దొరికింది. ఆ వ్యాలెట్ బాగా పాతబడిపోయి ఉంది. అందులో మహిళకు సంబంధించి ఐడీ ప్రూఫ్ కూడా ఉంది. అయితే, అంత క్లారిటీగా లేకపోవడంతో గుర్తింపు కష్టమైంది. దాంతో ఈ వ్యాలెట్ దొరికిన వాళ్లు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా ఆ మహిళ 46 ఏళ్ల క్రితం పోయిన తన పర్స్‌ను గుర్తించి కనిపెట్టింది.

శానిటైజేషన్ చేసే సమయంలో పాత క్యాండీ బార్ రేపర్లు, టికెట్ స్టబ్‌లు, సోడా డబ్బాల్లో ఈ పర్స్ దొరికిందని ఉద్యోగి టామ్ స్టీవెన్ చెప్పారు. దీన్ని తెరిచి చూడగా.. పాత చిత్రాలు, ఇతర వస్తువులు ఇందులో కనిపించాయి. ఈ పర్సులో డబ్బు లేదు, కానీ ఫోటోల మాత్రం ఉన్నాయి. అలాగే.. 1973 గ్రేట్‌ఫుల్ డెడ్ కచేరీ టికెట్, కొలీన్ డిస్టిన్ అనే మహిళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉన్నాయని స్టీవెన్ చెప్పుకొచ్చారు. అయితే, ఆ డ్రైవింగ్ లైసెన్స్‌ ఐడీలో ఫోటో సరిగా లేకపోవడంతో థియేటర్ ఫేస్‌బుక్‌లో పేజీలో షేర్ చేశారు. దాంతో ఆ పోస్ట్ కాస్తా వైరల్‌గా మారి.. చివరికి వెంచురాలోని డిస్టిన్‌(పర్స్ పోగొట్టుకున్న మహిళ)కు సమాచారం చేరింది. ఈ వ్యాలెట్ తనదే అంటూ డిస్టిన్ ప్రకటించింది.

46 సంవత్సరాల తరువాత తన వ్యాలెట్ తిరిగి దొరకడం పట్ల షాకింగ్‌తో కూడిన ఆనందం వ్యక్తం చేసింది డిస్టిన్. 1975 లో ఈ పర్స్ కోల్పోయారు. ఆ సమయంలో ఆమె వయస్సు 20 మాత్రమే. ఈ పర్సులో ఐదు డాలర్ల టికెట్, ఆమె తల్లి ఫోటో ఉన్నాయి. అది చూసి ఆ మహిళ ఉద్వేగానికి గురైంది. ఇందులో విలువైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఈ వ్యాలెట్ తిరిగి దొరుకుతుందని కలలో కూడా ఊహించలేదన్నారు.

Also read:

Old Currency Notes: పాత 500 రూపాయల నోట్‌తో రూ. 10 వేలు సంపాదించొచ్చు.. అదెలాగంటే..