AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆఫీసులో కుర్చీలను చూసి భయపడుతున్న ఉద్యోగులు.. అసలేం జరిగిందంటే!

గంటల తరబడి కుర్చీలో కూర్చుంటే మరణానికి చేరువయ్యే ప్రమాదముందని వైద్యులు అంటుంటారు. ఈ కంపెనీ దాని గురించి చెబుతూ.. ఏం చేసిందంటే..

Viral: ఆఫీసులో కుర్చీలను చూసి భయపడుతున్న ఉద్యోగులు.. అసలేం జరిగిందంటే!
Coffin Shaped Chairs
Ravi Kiran
|

Updated on: Sep 27, 2022 | 6:52 PM

Share

ప్రస్తుతకాలంలో అందరూ గంటలు తరబడి కుర్చీలకు అతుక్కుపోయి పని చేస్తున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నా.. కొందరికి అది తప్పని పరిస్థితి. ఇలా గంటలు తరబడి కుర్చీలలో కూర్చుని పని చేయడం వల్ల త్వరగా మరణానికి చేరువయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సమయం కంటిన్యూగా ఇలా కుర్చీల్లో కూర్చోవడం స్మోకింగ్‌తో సమానమంటున్నారు. ఇదిలా ఉంటే ఈ విషయం ఉద్యోగులకు మరింత విపులంగా చెప్పాలనుకున్న ఓ సంస్థ ఓ అడుగు ముందుకు వేసి వినూత్న ప్రయోగం చేసింది. అది చూసి ఉద్యోగులు భయపడుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. యూకేకు చెందిన Chairbox అనే సంస్థ కుర్చీలనే శవ పేటిక ఆకారంలో తయారు చేసింది. ఈ కుర్చీలను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ శవపేటిక కుర్చీ ప్రత్యేకతను వివరిస్తూ `మేము మా కొత్త ఉత్పత్తిని పరిచయం చేయడం సంతోషంగా ఉంది. ఇది The Last Shift Office Chair. ఒక ఉద్యోగి పనిచేస్తూ చనిపోతే, మేనేజ్‌మెంట్ టాప్ కవర్‌ వేసి, కుర్చీతో సహా కార్పొరేట్ స్మశానవాటికకు తరలించవచ్చు. సరళమైనది అయినప్పటికీ సమర్థవంతమైనది` అని ఆ కంపెనీ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. మనుషుల శారీరక నిర్మాణం ప్రకారం ఎక్కువ గంటలు కూర్చుని పని చేయకూడదని సంస్థ తెలిపింది. రోజులో ఎంత వ్యాయామం చేసినా ఎక్కువ సమయం కూర్చుని ఉండటం వలన ఉపయోగం ఉండదని, దీని గురించి ఉద్యోగులందరికీ అవగాహన కల్పించాలని ఈ కుర్చీలను తయారు చేసినట్లు తెలిపింది. కాగా ఈ కుర్చీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను చూసిన కొందరు నెటిజన్లు `నో థాంక్స్` అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Chairbox (@chairboxdesign)

మరిన్ని వింతలు-విశేషాల కోసం..