కడలిలో కళ్యాణం, స్కూబా డైవింగ్‌ సెషన్స్‌కి హాజరై మరీ తాళి కట్టించుకున్న వధువు శ్వేత. తీరం నుంచి 4.5 కిలోమీటర్లలోపల పెళ్లి తంతు

కడలిలో కల్యాణమిది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సాదా సీదా పెళ్లి అయితే మజా ఏముందనుకున్నారో ఏమో.. ఏకంగా కడలి గర్భంలో కల్యాణం..

కడలిలో కళ్యాణం,  స్కూబా డైవింగ్‌ సెషన్స్‌కి హాజరై మరీ తాళి కట్టించుకున్న వధువు శ్వేత. తీరం నుంచి 4.5 కిలోమీటర్లలోపల పెళ్లి తంతు
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 02, 2021 | 4:55 AM

కడలిలో కల్యాణమిది. ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే సాదా సీదా పెళ్లి అయితే మజా ఏముందనుకున్నారో ఏమో.. ఏకంగా కడలి గర్భంలో కల్యాణం చేసుకున్నారు. సముద్ర జీవాల సాక్షిగా మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. అయితే దీని వెనుక ఓ మంచి సందేశం కూడా ఉంది. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన శ్వేత, తిరువణ్ణామలైకి చెందిన చిన్నాదురై ఇద్దరూ ఐటి ప్రొఫెషనల్స్ .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ వివాహం వినూత్నంగా ఉండాలని ప్లాన్‌ చేసుకున్నారు. ఏకంగా సముద్ర గర్భంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ముందుకుసాగారు.

సముద్రంలోని మీనాల సాక్షిగా మూడు ముళ్లు వేశాడు వరుడు చిన్నాదురై.. ఆల్చిప్ప కళ్లు పెద్దవి చేసి చూస్తుండగా సిగ్గుల మొగ్గలా మెడలో తాళి కట్టించుకుంది వధువు శ్వేత. కడలిలోని అలల శబ్దమే మంగళ వాయిద్యంలా మారిపోయిన వేళ.. వధూవరులిద్దరు ఒక్కటయ్యారు. కోయంబత్తూరుకు సమీపంలోని నీలాంకరై తీరంలో పెళ్లితో ఒక్కటయ్యారు. తీరం నుంచి 4.5 కిలోమీటర్ల కడలి గర్భంలో వివాహం జరిగింది. అయితే ఇలా సముద్రంలో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చిన దగ్గరి నుంచి భారీ స్థాయిలోనే కసరత్తు చేశారు వధూవరులిద్దరు.

వరుడు చిన్నాదురైకి 12 ఏళ్లుగా స్కూబా డైవింగ్‌ తెలుసు. అయితే వధువు శ్వేతకు మాత్రం కొత్త. దీంతో కొన్ని రోజుల పాటు స్కూబా డైవింగ్‌ సెషన్స్‌కి హాజరైంది శ్వేత. నీటిలో ఎక్కువ సమయం ఊపిరి బిగపట్టి ఎలా ఉండాలో తెలుసుకుంది. అలా శిక్షణ పూర్తయిన తర్వాతే వీరు పెళ్లికి ముహూర్తం నిర్ణయించుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరు నీటిలోనే ఉన్నారు. అయితే కడలి అంచున వివాహం చేసుకోవడంలో మంచి సందేశం కూడా ఉంది. పర్యావరణాన్ని కలుషితం చేయొద్దని, పుడమికి నష్టం కలిగించే ప్లాస్టిక్‌ని ఉపయోగించకూడదనే సందేశాన్ని జనానికి ఇచ్చేందుకే ఇలా పెళ్లి చేసుకున్నామని చెబుతోందీ జంట.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ