King Cobra Facts: విషం ఉన్నా తల్లిగా బాధ్యతతో ఉంటుంది.. కింగ్ కోబ్రా గురించి ఆశ్చర్యకరమైన విషయాలు మీకోసం..!
కింగ్ కోబ్రా పాము పేరు వింటేనే చాలా మందికి భయం వేస్తుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, విషపూరితమైన పాములలో ఒకటి. దీని పొడవు సగటున 18 అడుగుల వరకు ఉంటుంది. కింగ్ కోబ్రా విషం చాలా ప్రమాదకరం. ఒక్కసారి కాటు వేస్తే ఏనుగులు సహా పెద్ద జంతువులను కూడా చంపగలదు.

అయితే ఈ పాము స్వభావం చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇది అవసరమైనప్పుడు మాత్రమే తనకు ఎదురయ్యే శత్రువులపై దాడి చేస్తుంది. కింగ్ కోబ్రా సాధారణంగా దాడికి ముందు హెచ్చరికలు ఇస్తూ ముందుగా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. పర్యావరణంలో ఈ పాము చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇది ఇతర పాములను వేటాడి తినడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుతుంది.
కింగ్ కోబ్రా పిల్లల విషయంలో ఇతర పాముల్లాగే అసాధారణంగా ఉంటుంది. సాధారణ పాములు తమ పిల్లలను వెంటనే వదిలేస్తాయి. కానీ కింగ్ కోబ్రా ఆడ పాము తన గుడ్ల కోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతుంది. వర్షాకాలం ప్రారంభం కాబోయే ముందు సాధారణంగా మే నెలలో ఆడ కోబ్రా గుడ్లు పెట్టడానికి గూడు కట్టడం ప్రారంభిస్తుంది.
ఈ గూడు సాధారణంగా నీరు చేరని.. బయటి ప్రమాదాల నుంచి సురక్షితమైన ప్రదేశాలలో ఉండేలా ఎంచుకుంటుంది. ఆడ కోబ్రా చెట్ల మధ్యలో లేదా వెదురు ప్రాంతాల్లో గుడ్ల కోసం సరైన స్థలాన్ని ఎంచుకుంటుంది. తన శరీరాన్ని ఉపయోగించి ఆకులు, చిన్న కర్రలు, పొడి పువ్వులు సేకరించి వాటిని కుప్పగా మడత వేసి గూడు కడుతుంది.
కింగ్ కోబ్రా గూడు సగటున ఒక మీటర్ ఎత్తు ఉంటుంది. ఈ గూడు లోపల గుడ్ల కోసం ప్రత్యేకంగా చిన్న కప్పు ఆకారపు గుహలు ఉంటాయి. ఆడ కోబ్రా ఒకసారి 15 నుంచి 50 గుడ్లు పెట్టగలదు. ఈ గుడ్లు పెట్టిన తర్వాత సుమారు 100 రోజుల వరకు ఆడ కోబ్రా గుడ్లను కాపాడుతుంది.
గూడు నిర్మాణంలోనే ఆడ కోబ్రా చాలా శ్రద్ధ తీసుకుంటుంది. కూలిపోతే గూడును మళ్లీ కడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత పిల్లల భద్రత కోసం ఎలాంటి ప్రమాదం ఎదురైనా ఆడ కోబ్రా అక్కడే ఉంటుంది. ఈ సమయంలో అది పిల్లలను రక్షించడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఇలా కింగ్ కోబ్రా పాము తన పరిసరాలలో సమతుల్యత కాపాడటంలో, పిల్లల సంరక్షణలో ఎంతో బాధ్యతాయుతంగా ఉంటుంది.




