AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలోని ఆ ఊరంతా వనవాసానికి వెళ్లింది.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!

ఊరంతా వనవాసానికి బయలుదేరింది. నిజ‌మే ఈ ఊరు ఊరంతా అడ‌వి బాట పట్టింది. అన్ని ఇళ్ల‌కూ తాళాలు వేసి మ‌రీ వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో...

తెలంగాణలోని ఆ ఊరంతా వనవాసానికి వెళ్లింది.. ఎక్కడ..? ఎందుకు..? పూర్తి వివరాలు తెలుసుకోండి..!
Ram Naramaneni
|

Updated on: Jan 25, 2021 | 8:36 PM

Share

ఊరంతా వనవాసానికి బయలుదేరింది. నిజ‌మే ఈ ఊరు ఊరంతా అడ‌వి బాట పట్టింది. అన్ని ఇళ్ల‌కూ తాళాలు వేసి మ‌రీ వెళ్లిపోయారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో గల ఈ ఊరి పేరు డోకూరు. ఇంతకూ అంద‌రూ ఇలా ఎందుకు అడవి బాటపట్టారని తెలుసుకుందాం పదండి.

మహబూబ్‌నగర్‌జిల్లా దేవరకద్ర మండలం డోకూరుగ్రామ ప్రజలు వనవాసానికి వెళ్లారు. గ్రామంలో నిత్యం ఎవరో ఒకరు చనిపోతున్నారు. ఇప్పటివరకూ వరుసగా 12 మంది చనిపోయారు. దీంతో తమ గ్రామానికి ఏదో అరిష్టం పట్టుకుందని గ్రామస్తులు భావిస్తున్నారు. అందుకే ఒకరోజు ఊరువిడిచి పెట్టాలని మూకుమ్మడి నిర్ణయానికి వచ్చారు. పిల్లా, పెద్దా అంతా కలిసి తట్టాబుట్ట సర్దుకుని ఇలా పొలాలకు పయనమయ్యారు.

గతంలో అంటురోగాలు ప్రబలినప్పుడు గ్రామం విడిచి వనవాసానికి వెళ్లే వాళ్ళమని ఇక్కడివారు చెబుతున్నారు. ప్రస్తుతం గ్రామంలో వరుస మరణాలు భయపెడుతున్న క్రమంలో.. పిల్లాజెల్లా, గొడ్డు, గోదా అందరం ఎవరి పొలాల వద్దకు వాళ్లు వెళ్తున్నామని చెబుతున్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరి చీకటి పడే వరకు అడవిలోనే గడుపుతామని అంటున్నారు. ఇలా చేయడం వల్ల గ్రామాలలో అంటురోగాలు గానీ, అరిష్టాలు గానీ జరగకుండా ఉంటాయని ఇక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు.

ఊర్లోని జ‌నాభా మాత్ర‌మే కాదు వారి పెంపుడు జంతువులు, గొడ్డుగోదా అంత‌టినీ త‌మ‌తో త‌ర‌లించుకుపోయారు. ఊర్లో ఒక్క ప్రాణి కూడా లేదు. అడ‌విలోనే వంటావార్పూ చేసుకున్నారు. ఆడిపాడి అల‌సిపోయి సాయంత్రానికి ఊరికి తిరిగివ‌చ్చారు. అయితే, వరుస మరణాలకు కారణమేంటో తెలియడంలేదని గ్రామస్తుల వాపోతున్నారు.

Also Read:

శ్రీకాకుళం జిల్లాలో యువకుడికి చిక్కిన వింత చేప.. దాని పేరు కూడా మత్సకారులకు తెలియదట..!

Pangolin smuggling: మంచిర్యాల జిల్లాలో అలుగును పట్టారు.. కోటిన్నరకు బేరం పెట్టారు.. చివరకు

చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ