Viral News: చేపకి గంటపాటు ఆపరేషన్ చేసిన వైద్యులు..! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
Fish Operation: ఇప్పటివరకు మీరు అనేక శస్త్ర చికిత్సలు, ఆపరేషన్ల గురించి విని ఉంటారు. కానీ ఈ విషయం గురించి ఎప్పుడు విని ఉండరు. ఎందుకంటే ఇక్కడ వైద్యులు
Viral News: ఇప్పటివరకు మీరు అనేక శస్త్ర చికిత్సలు, ఆపరేషన్ల గురించి విని ఉంటారు. కానీ ఈ విషయం గురించి ఎప్పుడు విని ఉండరు. ఎందుకంటే ఇక్కడ వైద్యులు ఒక చేపకు గంటపాటు ఆపరేషన్ చేశారు. అవును వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం.12 ఏళ్ల గోల్డ్ ఫిష్ కంటికి వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేశారు. డోటీ (చేప పేరు) అనే చేప ఎడమ కంటిలో పెద్ద కణితి ఏర్పడింది. దీని వల్ల కంటి చూపు పోవచ్చు కానీ వైద్యులు ఒక గంటపాటు కష్టపడి శస్త్రచికిత్స చేసి చేప కంటిని కాపాడారు.
డైలీ రికార్డ్స్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. డోటీ ఒక గోల్డ్ ఫిష్. దీని యజమాని పేరు కరోలిన్ మెక్‌హగ్. ఈమె గ్లాస్గో నివాసి. 35 ఏళ్ల కరోలిన్ వృత్తిరీత్యా పశువైద్యురాలు. ఒక రోజు ఆమె తన పెంపుడు చేప ఎడమ కన్ను ఎర్రగా మారడం గమనించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ పరీక్ష చేయగా డోటీ ఎడమ కంటిలో పెద్ద కణితి ఉన్నట్లు గుర్తించింది. శస్త్రచికిత్స ద్వారా తొలగించకపోతే చేప కంటిచూపు పోతుంది.
డాటీ పరిస్థితిని చూసిన ఆమె వెంటనే ఆమెకు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించుకుంది. ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా చిన్న పనిముట్లు తయారు చేశారు. అప్పుడు డోటీని ఫిష్ ట్యాంక్‌లో వేసి మత్తుమందు ఇచ్చారు. తర్వాత అతని శస్త్రచికిత్స ప్రారంభమైంది. ఆ సమయంలో చేపల మొప్పల్లో సిరంజి సహాయంతో నీరు ఇచ్చారు. తద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండదని వైద్యులు తెలిపారు. ఈ శస్త్రచికిత్స సుమారు గంటపాటు కొనసాగింది. ఆపరేషన్ విజయవంతమైంది డోటీ కంటి నుంచి కణితి తొలగించారు. శస్త్రచికిత్స తర్వాత మూడు రోజులకే డాటీ పూర్తిగా కోలుకున్నారని కరోలిన్ తెలిపింది. ఈ అరుదైన చేప శస్త్రచికిత్స గ్లాస్గోలోని మెక్‌డొనాల్డ్ వెట్స్‌లో జరిగింది.