Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జంతువుల జిమ్ వర్కౌట్స్.. జూ పార్క్‌లో మూగజీవాల ఎక్సర్‌సైజులు చూస్తే ఫిదా కావాల్సిందే..

మనుషులకే కాదు.. జంతువులకూ వ్యాయామం అవసరమయ్యింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలోని జంతువులకు

జంతువుల జిమ్ వర్కౌట్స్.. జూ పార్క్‌లో మూగజీవాల ఎక్సర్‌సైజులు చూస్తే ఫిదా కావాల్సిందే..
Chittoor Tigers
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 25, 2021 | 1:48 PM

Tirupati Zoo: మనుషులకే కాదు.. జంతువులకూ వ్యాయామం అవసరమయ్యింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలోని జంతువులకు ఆటవిడుపు కోసం చేసిన ఏర్పాట్లు చూస్తే అదే విషయం స్పష్టం అవుతోంది. సింహాలు, పులులు, చిరుతలు, కోతులు ఇలా పలు జంతువులు ఆటాడుకుని సేదతీరేందుకు ఏర్పాట్లు చేసిన జూ అధికార్లు.. ఎన్రిచ్మెంట్‌లో భాగంగా జంతువుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. పులులు సేద తీరేందుకు వెదురు మంచెలను ఏర్పాటు చేసిన జూ అధికార్లు సింహాలు పులులు బంతాట ఆడేందుకు చెక్కతో తయారు చేసిన బంతులను అందుబాటులోకి తెచ్చారు.

అంతేనా.. పాత టైర్లతో కోతులు ఊగి సేదతీరేందుకు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా జంతు ప్రదర్శనశాలలో ఎన్ క్లోజర్లను ఏర్పాటు చేసి పర్యాటకుల సందర్శనకు మాత్రమే అందుబాటులో ఉండే జంతువులకు ఇప్పుడు సహజసిద్ధమైన వాతావరణ పరిస్థితులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసిన అధికార్లు జంతువులు శారీరక శ్రమకు దూరం కాకుండా చేసే ప్రయత్నం చేసారు. తిరుపతి జూ పార్క్ లో 41 ఎన్ క్లోజర్లు ఉండగా అందులో 16 సింహాలు, 10 తెల్లపులులతోపాటు చిరుతలు ఇతర జంతువులు ఉన్నాయి. ఇందులో 30 ఎన్ క్లోజర్లలో బిహేవియర్ ఎన్రిచ్మెంట్ పేరుతో వన్యమృగాలను ఆటల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్న జూ క్యూరేటర్ హిమశైలజ జంతువులు శారీరకంగా మానసికంగా ఆర్యోగ్యంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

కోతులు, నెమళ్లు, అడవికోళ్లు వంటి పది రకాల పక్షిజాతులు ఉండే ఫ్రీసెంట్రీ ఎన్ క్లోజర్ లో తాటి మొద్దులు, వెదురు కర్రలతో మంచెలు ఉంచారు. 50 రకాల చిలుకలు ఉండే ప్యారెట్ వరల్డ్ ఎనోక్లోజర్ లో చెక్కతో చిన్నపాటి గదులను ఏర్పాటు చేసారు. ఎలుగుబంట్లు ఉన్న ఎనోక్లోజర్ లో ఆడుకోవడానికి వీలుగా ఇనుప పైపులను అమర్చారు. తెల్ల పులులు, సింహాలు ఆడుకోడానికి చెక్క బంతులను తయారు చేసి అందుబాటులో ఉంచిన అధికార్లు సందర్శకులులను కూడా ఆకట్టుకునేలా చేశారు.

మాంసాహార జంతువులు ఉండే ఎన్ క్లోజర్ల లో ఎత్తుగా మంచెలు ఏర్పాటు చేసి పైకి ఎక్కిదిగేందుకు వీలుగా వెదురు కర్రలతో నిచ్చెన తరహాలో అమర్చారు. జంతువులు ఎన్ క్లోజర్ల లో ఉండటం వల్ల శారీరక శ్రమకు దూరమై అనారోగ్యం పాలు కాకుండా ఉండేందుకు ఆటవిడుపుగా ఇలాంటి ఏర్పాట్లు చేసామంటున్న జూ క్యూరేటర్ బీహేవియర్ ఎన్ రిచ్మెంట్ భాగంగా ఏర్పాట్లు చేశామంటున్నారు.

ఏమ్పీఆర్ రాజు, టీవీ9 ప్రతినిధి, చిత్తూరు జిల్లా

Read also: శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు 35 నిమిషాల్లోనే.. అరగంటలో 2.88 లక్షల టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌