PM Narendra Modi: మనలో ఆత్మవిశ్వాసానికి కొదవ లేదు… టీమిండియా విజయమే స్ఫూర్తి… ప్రధాని మోడీ
అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీమిండియా ఇటీవల
భారతీయుల్లో ఆత్మ విశ్వాసానికి కొదవ లేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అస్సాంలోని తేజ్‌పూర్ యూనివర్సిటీ విద్యార్థులనుద్దేశించి ప్రధాని మాట్లాడుతూ… టీమిండియా ఇటీవల ఆసీస్ పర్యటనలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నదని అన్నారు. ఒకానొక దశలో దారుణంగా ఓడిపోయిందని, అయినా కఠిన సవాళ్లను ఎదురిస్తూ మళ్లీ విజయం సాధించిందని, దానిని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
మనలో అంతులేని సామర్థ్యాలు ఉన్నాయి…
టీమిండియా ఆటగాళ్ల గాయాలను ప్రధాని ప్రస్తావిస్తూ… చివరి రెండు టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లకు అనుభవం లేదని, అయినా ఆత్మవిశ్వాసానికి మాత్రం కొదవ లేదనే విషయాన్ని రుజువు చేశారని కొనియాడారు. చివరికి వాళ్లే చరిత్ర సృష్టించారని కితాబిచ్చారు. అలానే కరోనా వచ్చిన సమయంలో ప్రజలు కూడా చాలా భయపడ్డారని అన్నారు. అయితే దేశం ఆ సవాలును సమర్థంగా ఎదుర్కొన్నదని తెలిపారు. స్వదేశీయంగా వ్యాక్సిన్లను తయారు చేశామని, ఇప్పుడు కోవిడ్‌తో పోరాడుతున్నామని అన్నారు. మన సైంటిస్టులపై మనం చూపిన విశ్వాసం, వారిలోని సామర్థ్యాల వల్లే వ్యాక్సిన్ల తయారీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.