AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏకాంతంగా కలుద్దామని ప్రేయసిని రమ్మన్నాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే

ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలు ఈ మధ్యకాలంలో చావుకు దారి తీస్తున్నాయ్. ఇలాంటి ఘటన ఒకటి కర్ణాటకలో చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ పరిచయం కాస్తా.. ప్రేమగా మారి.. ఆ తర్వాత చావుకు దారి తీసిన యువతి కథ‌ ఇది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏకాంతంగా కలుద్దామని ప్రేయసిని రమ్మన్నాడు.. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిందిదే
Karnataka
Ravi Kiran
|

Updated on: Aug 23, 2025 | 1:28 PM

Share

ఈ మధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ప్రేమలు ఎక్కువైపోయాయ్. ప్రేమ పేరుతో మోసపోయే యువతులు.. చివరికి అటు తల్లిదండ్రులకు చెప్పలేక.. ఇటు సొసైటీలో అవమానభారాన్ని ఎదుర్కోలేక విగతజీవులవుతున్నారు. ఇలాంటి కోవకు చెందిన ఓ ఘటన ఇటీవల కర్ణాటకలోని చిత్రందుర్గలో చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన ఓ పరిచయంలో ప్రేమను వెతుక్కుని.. చివరికి చావుకు దగ్గరైన ఓ యువతి కథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రందుర్గకు చెందిన డిగ్రీ విద్యార్థిని వర్షిత(19)కు చేతన్(21) అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తూ, కొత్తవారిని చేర్చడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు చేతన్. ఇక ఆ పోస్ట్ చూసి ఉద్యోగం కోసం చేతన్‌కు కాల్ చేసింది వర్షిత. ఆ పరిచయం కాస్తా.. స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మలుపు తిరిగింది.

ఆపై ప్రేమ కాస్తా శారీరక కలయికగా మారి.. వర్షిత గర్భం దాల్చింది. ఈ విషయం వర్షిత పిన్నికి తెలియగా.. ఆమె చేతన్‌కు ఫోన్ చేసింది. వర్షితను పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో.. ఆమె వేరేవారితో సన్నిహితంగా ఉందనే అనుమానం పెంచుకున్నాడు చేతన్. ఈ నెల 18న వర్షితను నమ్మించి, చిత్రదుర్గ బైపాస్ రోడ్డులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడు చేతన్. ఆపై ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆ సమయంలో వర్షం పడడంతో సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం వర్షితదిగా గుర్తించి, విచారించగా చేతన్ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.