పెళ్లి రోజే కొత్త పెళ్లికూతురు అలక.. ఊరేగింపునకు కారు రాలేదని ఏం చేసిందో తెలుసా?
అట్టహాసంగా వివాహ తంతు ముగిసింది. అతిథులతో సంబరాల్లో మునిగిపోయారు. కానీ వీడ్కోలు సమయం వచ్చినప్పుడు, వధువు స్వయంగా తన మొబైల్ తీసి, యాప్ తెరిచి, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయి.. అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. పెళ్లి వీడ్కోలు సమయంలో అందమైన కారు లేదు. అలంకరించబడిన వాహనం లేదు. ఇది సాధారణ టాక్సీ..!

అట్టహాసంగా వివాహ తంతు ముగిసింది. అతిథులతో సంబరాల్లో మునిగిపోయారు. కానీ వీడ్కోలు సమయం వచ్చినప్పుడు, వధువు స్వయంగా తన మొబైల్ తీసి, యాప్ తెరిచి, క్యాబ్ బుక్ చేసుకుని వెళ్లిపోయి.. అందరినీ షాక్‌కు గురిచేస్తుంది. పెళ్లి వీడ్కోలు సమయంలో అందమైన కారు లేదు. అలంకరించబడిన వాహనం లేదు. ఇది సాధారణ టాక్సీ.. ఆపై ఆమె సాధారణ కారులో కూర్చుని తన వరుడితో కలిసి తన అత్తమామల ఇంటికి బయలుదేరింది. ఇది సినిమా సన్నివేశం కాదు, సోషల్ మీడియాలో వైరల్ అయిన నిజమైన సంఘటన. వీడియోలో ఈ ప్రత్యేకమైన వీడ్కోలు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నెటిజన్లు దీనిని ‘స్వాభిమాన్ విదై’ అని పిలుస్తున్నారు.
వైరల్ వీడియోలో, పెళ్లికి సంబంధించిన అన్ని ఆచారాల తర్వాత ఒక వధువు బయలుదేరడానికి సిద్ధంగా నిలబడి ఉంది. కానీ అలంకరించిన ఊరేగింపు కారు మాత్రం రాలేదు. ఎంతోసేపు వేచి చూసింది. చివరికి ఆమె నవ్వుతూ తన మొబైల్ నుండి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆమె పక్కన నిలబడి ఉన్న వరుడు కూడా నిశ్శబ్దంగా ఆమెకు సహాయం చేశాడు. వధువు ఫోన్‌లో క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడటం కనిపింది. ఆ తర్వాత ఆమె కారు డ్రైవర్‌ను కారును గుర్తించమని అక్కడున్నవారిని అడుగుతుంది. కొన్ని నిమిషాల్లో క్యాబ్ వస్తుంది. వధూవరులు ఎటువంటి డ్రామా లేకుండా, ఎటువంటి ఫిర్యాదు లేకుండా ఆ క్యాబ్‌లో కూర్చుని వెళ్లిపోయారు. సమీపంలో నిలబడి ఉన్న అతిథులు, బంధువులు ఒక క్షణం ఆశ్చర్యపోయారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం, ఈ వివాహం చాలా వైభవంగా జరిగినప్పటికీ, ఆ అబ్బాయి కుటుంబం ఈ సంబంధం పట్ల సంతోషంగా లేదు. ఈ అసంతృప్తి కారణంగా, వీడ్కోలు కోసం కారు లేదా అలంకరణ ఏర్పాటు చేయలేదు. వధువుకు ఈ విషయం తెలిసింది. కానీ ఆమె ఎటువంటి గొడవ సృష్టించలేదు. ఆమె ఏడవలేదు, ఫిర్యాదు చేయలేదు. బదులుగా, పూర్తిగా శాంతియుతంగా ఆత్మగౌరవంతో, ఆమె తనదైన మార్గాన్ని ఎంచుకుంది. తన మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ తర్వాత వరుడు కూడా తన వధువుకు అండగా నిలిచాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు.
వీడియో చూడండి..
This is so embarrassing to watch. Bride had to book cab for herself because no one in the groom’s family cared about her. Ruined a special and emotional moment of her vidayi. And the way he’s smiling, is he even responsibile enough to get married ? pic.twitter.com/KfySNjvDF6
— Matakti aankhein (@prettymoon_23) August 22, 2025
ఈ వీడియోను @prettymoon_23 అనే ఖాతా నుండి షేర్ చేయగా, ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు. చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. సోషల్ మీడియా వినియోగదారులు వీడియోకు భిన్నమైన స్పందనలు తెలియజేస్తున్నారు. ఆమె తన ఆత్మగౌరవం, ప్రేమ రెండింటినీ కలిసి నెరవేర్చుకున్న స్త్రీమూర్తిగా కనిపిస్తుందని ఒక నెటిజన్ రాసుకొచ్చాడు. మరొకరు.. చాలా బాగుంది సోదరి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వారి పని, మీరు మీ స్వంత మార్గాన్ని ఎంచుకున్నందుకు సంతోషం ఉందన్నారు. ఎంత గొప్ప విషయం, మీరు నా హృదయాన్ని సంతోషపెట్టారంటూ మరో వినియోగదారుడు రాసుకొచ్చాడు..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
