బాలిక డెంటల్ ఎక్స్‌రే చూసి అంతా షాక్.. తల్లి మాట వినకుంటే ఎంత పనైంది
పెద్దల మాట సద్దిమూట అని ఊరికే అనలేదు. పెద్దల మాట పెడచెవిన పెడితే ఏమవుతుందో ఈ సంఘటనే నిదర్శనం. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్‌లో నివసిస్తున్న ఒక తల్లి తన 13 ఏళ్ల కుమార్తెను బ్రేసెస్ పెట్టిచేందు ఆర్థోడెంటిస్ట్ వద్దకు తీసుకెళ్లింది. అంతా సాధారణంగానే అనిపించింది. కానీ డాక్టర్ ఎక్స్-రేను స్క్రీన్‌పై ఉంచిన వెంటనే, అందరూ షాక్ అయ్యారు.
ఆ అమ్మాయి సైనస్‌లో లోహపు ముక్కు పుడక ఇరుక్కుపోయిందని ఆ ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపించింది. అది చూడగానే తల్లికి ఏమీ అర్థం కాలేదు. కానీ, కూతురికి వెంటనే గుర్తుకు వచ్చింది. దాదాపు ఆరు నెలల క్రితం ఆమె తన తల్లిని ముక్కు కుట్టించుకుంటానని పట్టుబట్టింది. కానీ తల్లి స్పష్టంగా నిరాకరించింది.16 ఏళ్లలోపు ముక్కు కుట్టించుకోవద్దని చెప్పింది. అయితే తల్లిమాట పెడచెవిన పెట్టిన బాలిక తన ముక్కును కుట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆ సమయంలో లోహంలోని ఒక చిన్న భాగం ముక్కు లోపలికి వెళ్లి సైనస్‌లో చిక్కుకుంది. కానీ, అమ్మకు తెలిస్తే ఏమంటుందోననే భయం కారణంగా, ఆమె తన తల్లికి చెప్పలేదు. బహుశా ఆ ముక్కు పుడక దానంతట అదే బయటకు వచ్చేసి ఉంటుందని, లేదా మింగేసి ఉంటానని అనుకుంది. కానీ, ఈ రహస్యం ఎక్స్-రేలో బయటపడటంతో తల్లికి అసలు విషయం తెలిసింది. అయితే, డాక్టర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెద్ద ఫోర్సెప్స్‌తో ఆ ముక్కలో ఇరుక్కున్న ముక్కు పుడకను తొలగించారు. అయితే ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో చాలా మంది నెటిజన్స్ తమదైన శైలిలో స్పిందించారు. చాలా మంది వినియోగదారులు ఆమె ఇప్పుడు ఎలా ఉందని అడిగారు. నెటిజన్లకు సమాధానంగా ఆమె తల్లి స్పందిస్తూ.. తన కూతురు పూర్తిగా బాగానే ఉందని చెప్పింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jio: జియో యూజర్లకు షాకింగ్ న్యూస్
శుభవార్త.. ఏసీలు, టీవీలు మరింత అగ్గువ కేంద్రం సంచలన నిర్ణయం
‘మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం’ CM రేవంత్‌కు మెగాస్టార్ స్పెషల్ మెసేజ్
బ్యాడ్ లక్ అనుపమా..? ఈ సినిమా రిజెల్ట్ కూడా.. మూవీ రివ్యూ…
13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

