శుభవార్త.. ఏసీలు, టీవీలు మరింత అగ్గువ కేంద్రం సంచలన నిర్ణయం
మీరు టీవీ, ఫ్రిడ్జి వంటి గృహోపకరణాలు కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే అగండాగండి.. ఈ శుభవార్త మీకోసమే. మీరు మీ కొనుగోలు ప్లాన్‌ను కొన్ని రోజులు వాయిదా వేసుకుంటే బెస్ట్. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు భారీగా తగ్గనున్నాయట. జీఎస్టీ వ్యవస్థలో సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 28 శాతం GST స్లాబ్ నుండి ఎయిర్ కండిషనర్లను తొలగించి 18 శాతం GST స్లాబ్‌లోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
జీఎస్టీ సంస్కరణ అమలు తర్వాత వివిధ మోడళ్లను బట్టి ఏసీల ధరలు రూ.1500 నుండి రూ.2500 వరకు తగ్గుతాయి. ప్రభుత్వం ఇటీవల ఆదాయపు పన్నును తగ్గించడం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును సవరించిన తర్వాత ధరలలో ఈ తగ్గింపు జరగబోతోంది. ఈ నిర్ణయం తర్వాత ఏసీలకు ప్రాముఖ్యత పెంచడమే కాకుండా ‘ప్రీమియం AC’లకు డిమాండ్‌ను పెరుగుతుంది. అంతే కాకుడా 32 అంగుళాల కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న టీవీలపై జీఎస్టీ స్లాబ్‌ను ప్రస్తుత 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించడంలో టీవీలు చౌకగా మారనున్నాయి. అయితే ఏసీలు, ఇతర ఉపకరణాలపై GSTని 28 నుండి 18 శాతానికి తగ్గించిన పరిస్థితిలో మార్కెట్‌లో ధరలు నేరుగా 6-7 శాతం తగ్గుతాయి. ఎందుకంటే సాధారణంగా జీఎస్టీ బేస్ ధరపై విధించనున్నారు. అందుకే ఇది అపూర్వమైనదిగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీని వలన మోడల్‌ను బట్టి తుది వినియోగదారునికి ACల ధర రూ.1,500 నుండి రూ.2,500 వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారరు. తక్కువ జీఎస్టీ వల్ల ఏసీలు మరింత సరసమైనవిగా మారతాయి. అనేక కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడే అవకాశం ఏర్పడుతుంది. జీఎస్టీ తగ్గించడం వల్ల అమ్మకాలు 20 శాతం పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం’ CM రేవంత్‌కు మెగాస్టార్ స్పెషల్ మెసేజ్
బ్యాడ్ లక్ అనుపమా..? ఈ సినిమా రిజెల్ట్ కూడా.. మూవీ రివ్యూ…
13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

