Jio: జియో యూజర్లకు షాకింగ్ న్యూస్
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ వినియోగదారులకు ఊహించని షాకిచ్చింది. ఎంతో ఆదరణ పొందిన, తక్కువ ధరకే లభించే రోజువారీ 1జీబీ డేటా ప్లాన్‌లను నిలిపివేసింది. దీంతో జియో బేసిక్ ప్లాన్‌ల స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇంతకాలం జియోలో రోజుకు 1జీబీ డేటా అందించే ప్లాన్‌లలో 22 రోజుల వ్యాలిడిటీతో రూ. 209ల ప్లాన్, 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 249 ప్లాన్‌లు బాగా ప్రాచుర్యం పొందాయి.
అయితే, కంపెనీ ఇప్పుడు ఈ రెండు ప్లాన్‌లను తమ జాబితా నుంచి తొలగించింది. దాంతో రోజువారీ డేటా అందించే ప్లాన్‌లలో అత్యంత చౌకైన ఆప్షన్‌గా రూ. 299 ప్లాన్ ముందుకు వచ్చింది. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5జీబీ డేటా వస్తుంది. ఓవైపు ప్లాన్‌ల ప్రారంభ ధరను పెంచుతున్నప్పటికీ, జియో యూజర్ బేస్ మాత్రం గణనీయంగా పెరుగుతుండటం గమనార్హం. ఈ ఏడాది జూన్‌లో జియోలో ఏకంగా 19 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరారు. ఇది ప్రధాన పోటీదారు అయిన ఎయిర్‌టెల్ సాధించిన వృద్ధి కంటే రెట్టింపు కావడం విశేషం. ఇదే సమయంలో వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలు తమ వినియోగదారులను కోల్పోయాయి. పాత ప్లాన్‌లతో పోలిస్తే ఇప్పుడు కనీస రీఛార్జ్ మొత్తం పెరిగినప్పటికీ, దానికి బదులుగా ఎక్కువ రోజువారీ డేటాను జియో అందిస్తోంది. గతంలో 1జీబీగా ఉన్న డేటా పరిమితిని ఇప్పుడు 1.5జీబీకి పెంచారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్, ఇతర అవసరాలకు ఎక్కువ డేటా వాడే వారికి ఇది ప్రయోజనకరంగా ఉండవచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శుభవార్త.. ఏసీలు, టీవీలు మరింత అగ్గువ కేంద్రం సంచలన నిర్ణయం
‘మీ సపోర్ట్ ఎప్పుడూ అవసరం’ CM రేవంత్‌కు మెగాస్టార్ స్పెషల్ మెసేజ్
బ్యాడ్ లక్ అనుపమా..? ఈ సినిమా రిజెల్ట్ కూడా.. మూవీ రివ్యూ…
13 అవార్డులు గెలుచుకున్న బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్ నెక్ట్స్ లెవెల్ అంతే
సంక్రాంతి ముందు నాన్‌వెజ్ ప్రియులకు షాక్..
రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. ఆగిపోయిన వాహనాలు
కత్తులతో నడిరోడ్డుపై రచ్చ చేసిన మహిళ..
రాకుమారుల రుమాలు.. రేటు జస్ట్.. రూ.7 లక్షలే
అర్ధరాత్రి పోలీసుల ముందే బైక్ స్టంట్స్.. వీడియో వైరల్
బిచ్చగాడు కాదు లక్షాధికారి.. చనిపోయాక బయటపడ్డ నిజం
ఆ కొండపై ఫోన్ చేస్తే.. చనిపోయిన వాళ్ళూ పలుకుతారా ??

