PM Modi: నమో యాప్‌లో ‘జన్ మన్ సర్వే’.. మోదీ సర్కార్‌పై ప్రజాభిప్రాయ సేకరణ..
మోదీ 3.O కి ఏడాది పూర్తయింది. అలాగే ప్రధానిగా మోదీ పాలనకు 11 ఏళ్లు నిండాయి. ఈ 11 ఏళ్లలో భారత మేటి ప్రధానిగానే కాదు..ప్రపంచ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు నరేంద్ర మోదీ! వర్తమాన పునాదిపై భవిష్యత్తును తీర్చిదిద్దడం రాజనీతిజ్ఞత..! ఆ దారిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి.

మోదీ 3.O కి ఏడాది పూర్తయింది. అలాగే ప్రధానిగా మోదీ పాలనకు 11 ఏళ్లు నిండాయి. ఈ 11 ఏళ్లలో భారత మేటి ప్రధానిగానే కాదు..ప్రపంచ అగ్రనేతల్లో ఒకరిగా ఎదిగారు నరేంద్ర మోదీ! వర్తమాన పునాదిపై భవిష్యత్తును తీర్చిదిద్దడం రాజనీతిజ్ఞత..! ఆ దారిలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. విజ్ఞతతో ఎన్నో కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సివుంటుంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ 11 ఏళ్ల పాలనపై రిపోర్ట్ కార్డ్ ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ నేపథ్యంలోనే.. నమో appలో జన్‌మన్ సర్వేకి శ్రీకారం చుట్టారు. మరి మోదీ నాయకత్వంపై జనం ఏమనుకుంటున్నారు?
దేశంలో మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలనలో.. విప్లవాత్మక మార్పులు కనిపించాయి. మోదీ నాయకత్వం..దేశ దశను-దిశను మార్చివేసింది. సమాజంలో చివరి వరుసలో ఉన్న ప్రజలు కూడా గౌరవంగా జీవించే హక్కును అందించడానికి అవసరమైన ప్రతి నిర్ణయాన్ని ప్రధానమంత్రి మోదీ తీసుకున్నారు. 2025, జూన్ 9న మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. మోదీ 3.0 మొదటి సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. కానీ ఈ 11 సంవత్సరాలలో, దేశం ఒక మార్పును చూసింది. అది దశాబ్దం క్రితం వరకు ఎవరూ ఊహించనిది. ప్రధాని మోదీ తనను తాను దేశ ప్రధానమంత్రిగా ఎప్పుడూ భావించలేదు. ప్రజలకు ప్రధాన సేవకుడిగా నిరంతరం ప్రజా సంక్షేమంపై దృష్టిసారించారు. ఈ 11 ఏళ్లుగా పేదల అభ్యున్నతి, దేశవాసుల సేవకు అంకితమయ్యారు.
అంతేకాదు, తమ 11 ఏళ్ల పాలన ఎలా ఉందని? నేరుగా దేశ ప్రజలనే కోరుతున్నారు. తమ ప్రభుత్వం రిపోర్ట్ కార్డ్‌ను సిద్ధం చేయమని దేశవాసులకు విజ్ఞప్తి చేయడం మోదీ విజ్ఞాతకు నిదర్శనం! ప్రజా భాగస్వామ్యాన్ని, పారదర్శకతను ప్రోత్సహించడం ద్వారా..భారత భవ్య భవిష్యత్‌కు బాటలు వేయాలన్నది ప్రధాని సంకల్పం! కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా..నమో యాప్‌లో సర్వేకి శ్రీకారం చుట్టారు. గత పదేళ్లలో వివిధ రంగాల్లో దేశం సాధించిన ప్రగతిపై మీ అభిప్రాయం ఏమిటి? నమో యాప్‌లో ‘జన్ మన్ సర్వే’ ద్వారా మీ ఫీడ్‌బ్యాక్ నేరుగా తనతో పంచుకోవాలని ప్రధాని దేశవాసులకు పిలుపునిచ్చారు. మీ అభిప్రాయం చాలా ముఖ్యం! నమో యాప్ ద్వారా ‘జన్ మన్ సర్వే’లో పాల్గొనండి. భారతదేశ 11 సంవత్సరాల అభివృద్ధి ప్రయాణాన్ని మీరు ఎలా చూస్తున్నారో మాకు తెలియజేయండి.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అంతరాన్ని తగ్గించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం ఈ సర్వే ఉద్దేశంగా కనిపిస్తుంది. అలాగే పాలనలో మరింత పారదర్శకతను తీసుకురావాలన్న మోదీ మంత్రానికి ఈ సర్వే నిదర్శనంగా నిలుస్తుంది. ఇప్పటివరకు అందిన డేటా ప్రకారం, ఉత్తర ప్రదేశ్ అత్యధిక సంఖ్యలో 1,41,150 ప్రతిస్పందనలను పంపింది. తర్వాత మహారాష్ట్ర 65,775 ఫీడ్‌బ్యాక్స్ అందాయి. తమిళనాడు నుంచి 62,580, గుజరాత్ నుంచి 43,590, హర్యానా నుంచి 29,985 ప్రతిస్పందనలు లభించాయి. విశేషమేమిటంటే.. సర్వేలో పాల్గొన్న 77% మంది ప్రజలు మొత్తం సర్వేను పూర్తి చేశారు. జన్ మన్ సర్వేపై ఉత్సుకతకు, పౌరుల భాగస్వామ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది.