Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు

కర్ణాటకలోని కాంగ్రెస్ అగ్రనేతల ఇళ్లపై ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి. వాల్మీకి కార్పొరేషన్ స్కాంలో కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. కాంగ్రెస్ రాజకీయ కక్షతో ఈ దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తుండగా, బీజేపీ ఈడీ చర్యలను సమర్థిస్తోంది.

కాంగ్రెస్‌కు బిగ్‌ షాక్‌..! అగ్రనేతల ఇళ్లలో ఈడీ సోదాలు
Ed
Follow us
SN Pasha

|

Updated on: Jun 11, 2025 | 10:46 PM

కర్ణాటకలో కాంగ్రెస్‌ అగ్రనేతల ఇళ్లలో ఈడీ దాడులు సంచలనం సృష్టించాయి. బళ్లారి ఎంపీ తుకారాం, బ‌ళ్లారి సిటీ ఎమ్మెల్యే నారా భ‌ర‌త్ రెడ్డి, కంప్లి ఎమ్మెల్యే జేఎన్ గ‌ణేశ్‌, బ‌ళ్లారి రూర‌ల్ ఎమ్మెల్యే బీ నాగేంద్ర ఇళ్లలో సోదాలు కలకలం రేపాయి. వాల్మీకీ కార్పొరేషన్‌ స్కాంలో ఈడీ సోదాలు చేసింది. అయితే రాజకీయ కుట్రలో భాగంగానే సోదాలు నిర్వహించారని కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణాట‌క మ‌హార్షి వాల్మీకీ ఎస్టీ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ అకౌంట్ల నుంచి కోట్ల నిధుల‌ను అక్రమంగా ఫేక్ అకౌంట్లకు ట్రాన్స్‌ఫ‌ర్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. క‌ర్ణాట‌క పోలీసులు, సీబీఐ దాఖ‌లు చేసిన ఎఫ్ఐఆర్‌ల ఆధారంగా మ‌నీ లాండరింగ్‌ కేసును న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

వాల్మీకి ఎస్టీ కార్పొరేష‌న్‌ను 2006లో ప్రారంభించారు. ఎస్టీ వ‌ర్గీయుల‌ను సామాజికంగా, ఆర్థికంగా బ‌లోపేతం చేసేందుకు ఆ సంక్షేమ ప‌థ‌కాన్ని ప్రారంభించారు. వాల్మీకి నిధుల్ని బెల్లారీ నియోజ‌క‌వ‌ర్గంలో లోక్‌స‌భ ఎన్నిక‌ల కోసం వాడుకున్నట్లు ఈడీ ఆరోప‌ణ చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నిధులు దుర్వినియోగం చేసినట్టు అభియోగాలు మోపింది. మరోపక్క తమ పార్టీ నేతల ఇళ్లలో ఈడీ సోదాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. విచారణకు తాము పూర్తిగా సహకరిస్తామని, కాని రాజకీయ కక్షతో ఈ సోదాలు చేస్తున్నారని సిద్దరామయ్య విమర్శించారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఈడీ దాడులను పూర్తిగా సమర్ధిస్తున్నారు. వాల్మీకీ కార్పొరేషన్‌ స్కాంలో భారీగా నిధులు చేతులు మారాయని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల కోసం అక్రమంగా నిధులను దారిమళ్లించారని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
భార్య కళ్లెదుటే భర్త హత్య.. అసలు స్కెచ్ ఎవరిది!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కొత్త నవోదయ విద్యాలయాల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్!
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య భీకర యుద్దం.. రాజీకి రావాలని ట్రంప్ పిలుపు
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
ఈ సీడ్స్ తింటున్నారా..? వీటితో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
టీ అలవాటును కాస్త మార్చండి చాలు.. మీకు ఈ సమస్య ఉండదు..!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
యోగాంధ్రకు సర్వం సిద్ధం.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు!
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పనసపండుతో మొదలైన గొడవ.. తమ్ముడి ప్రాణం తీసే వరకు ఎలా వెళ్లింది?
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
పిల్లలకు ఈ అలవాట్లు నేర్పితే.. మస్త్ స్ట్రాంగ్‌ గా ఉంటారు..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
ఈ కూరగాయను తక్కువ అంచనా వేయకండి.. ఎన్నో రోగాలకు మందు ఇది..!
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత
బట్టతలపై జుట్టు మొలిపిస్తామంటే పోటెత్తిన జనం - ఆ తర్వాత