Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?

బరేలీ జిల్లాలోని సుభాష్ నగర్‌లో పోలీస్ కానిస్టేబుల్ ముఖేష్ కుమార్ త్యాగి మృతదేహం అనుమానాస్పదంగా రక్తపు మడుగులో కనిపించింది. అతని భార్య, కుమార్తె కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖేష్ మద్యం సేవించేవాడని, క్రమశిక్షణా చర్యలకు గురయ్యాడని తెలిసింది. ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

గదిలో రక్తపు మడుగులో కానిస్టేబుల్‌ మృతదేహం..! భార్య, కూతురు మిస్సింగ్‌! ఏం జరిగిందంటే..?
Police
Follow us
SN Pasha

|

Updated on: Jun 11, 2025 | 11:48 PM

బరేలీ జిల్లాలోని సుభాష్ నగర్‌లోని మధినాథ్ ప్రాంతంలో పోలీసు కానిస్టేబుల్ ముఖేష్ కుమార్ త్యాగి మృతదేహం రక్తపు మడుగులో ఓ అద్దె ఇంట్లో కనిపించడం తీవ్ర కలకలం రేపింది. అతను సంభాల్ జిల్లా నివాసి, బరేలీలో అద్దెకు నివసిస్తున్నాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపారు. మృతుడి భార్య, కుమార్తె కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. ముఖేష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా హత్య చేశారా? అసలు అతని భార్య, కూతురు ఏమైనట్టు అంటూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

38 ఏళ్ల ముఖేష్ కుమార్ త్యాగి 2011 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్. అతను తన భార్య తరుణ, కుమార్తె పారితో కలిసి సుభాష్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మధినాథ్ ప్రాంతంలోని అద్దె ఇంట్లో కొంతకాలంగా నివసిస్తున్నాడు. జూన్ 4 నుండి అతను విధులకు హాజరు కాలేదని పోలీసులు తెలిపారు. అంతకు ముందు కొన్ని క్రమశిక్షణా చర్యల కారణంగా అతన్ని పోలీస్ స్టేషన్ నుండి సస్పెండ్ చేశారు. బుధవారం అతను ఉంటున్న గది నుండి దుర్వాసన వస్తున్నట్లు పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి చూడగా ముఖేష్ మృతదేహం పడి ఉంది.

ముఖేష్ కుమార్ మద్యానికి బానిస అయ్యాడని ఎస్ఎస్పీ అనురాగ్ తెలిపారు. మద్యం సేవించిన తర్వాత అతను తరచుగా భార్యను కొడతూ, ఇంట్లోని వస్తువులను కూడా ధ్వంసం చేసేవాడని స్థానికులు తెలిపారు. ముఖేష్ తలపై గాయం ఉండటంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా నమోదు చేసుకున్నారు. ముఖేష్ మరణ వార్త అందిన తర్వాత, పోలీసులు అతని భార్య తరుణ, కుమార్తె పారిని సంప్రదించడానికి ప్రయత్నించారు, కానీ వారి ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఇంట్లో వారు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవు. సంఘటన జరిగిన సమయంలో వారిద్దరూ అక్కడే ఉన్నారా లేదా సంఘటన తర్వాత వెళ్లిపోయారా అనే సందేహం మరింత తీవ్రమవుతోంది. ప్రస్తుతం పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
నడిరోడ్డుపై దారుణంగా కొట్టుకున్న యువతీ యువకుడు..
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
పాన్‌ కార్డు ఉన్నవారికి అలర్ట్‌.. ఇది చేయకపోతే భారీ ఫైన్‌
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
కూల్‌ న్యూస్‌.. యూపీఐ పేమెంట్లపై ఛార్జీల్లేవ్.. కేంద్రం క్లారిటీ
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
బైపాస్‌ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్‌
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
కారు డ్రైవర్‌ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?
రూ.500 నోటుపై స్టార్‌ గుర్తు.. ఇది నకిలీదా..ఆర్బీఐ ఏం చెబుతోంది?