Toll Fees: కొన్ని సందర్భాల్లో టోల్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. ఏ సమయంలో అంటే.. కేంద్రం కొత్త గైడ్‌లైన్స్
Toll Fees: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధనలు ప్రకటించింది. టోల్ ప్లాజాల దగ్గర కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం.
Toll Fees: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త నిబంధనలు ప్రకటించింది. టోల్ ప్లాజాల దగ్గర కొత్త రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ ప్రకారం వాహనదారులు కొన్ని సందర్భాల్లో అసలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరమే లేదు. భారతదేశంలో 100 శాతం టోల్ ప్లాజాలు క్యాష్‌లెస్‌గా మారిపోయాయి. అంటే వాహనదారులు ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఏ టోల్ ప్లాజాలో కూడా నగదు తీసుకోవడం లేదు. ఏదైనా వాహనం టోల్ ప్లాజా దాటాలంటే ఖచ్చితంగా ఫాస్ట్‌ట్యాగ్ తప్పకుండా ఉండాల్సిందే. ఇటీవల నుంచి ఫాస్ట్‌ట్యాగ్‌ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. ఒకవేళ ఫాస్ట్‌ట్యాగ్ లేకపోతే అక్కడే ఫాస్ట్‌ట్యాగ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. దేశవ్యాప్తంగా అన్ని టోల్ ప్లాజాల్లో ఫాస్ట్‌ట్యాగ్ లేన్స్ ఉండటంతో ఇక వాహనాలు ఎక్కువ సమయం క్యూలో ఉండాల్సిన పరిస్థితి లేదు. కొన్ని సెకన్లలోనే వెళ్లిపోవచ్చు.
ఇక తాజాగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గైడ్‌లైన్స్ ప్రకారం.. టోల్ ప్లాజా వద్ద వాహనం 10 సెకండ్ల కంటే ఎక్కువ నిలుపాల్సిన పరిస్థితి రాదు. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో కూడా వాహనం 10 సెకండ్లలోపే టోల్ ప్లాజా దాటుతుంది. అయితే 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉండదని ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) పేర్కొంది. ఏవైనా కారణాల వల్ల టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్లయితే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చని స్పష్టం చేసింది. టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటి వాహనాలు క్యూలో ఉంటే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు… టోల్ ప్లాజాల దగ్గర ఏవైనా టెక్నికల్ పరంగా సమస్యలు ఉన్నా వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లిపోవచ్చని గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇవీ కూాడా చదవండి:
DRDO 2-DG: కరోనా కోసం డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం ధర ఖరారు.. ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం