Ramdev Baba: మరో కొత్త వివాదానికి తెరలేపిన రాందేవ్ బాబా.. అలోపతి వైద్యంపై ఐఎంఏకు 25 ప్రశ్నలు..!
అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు సూటైన ప్రశ్నలు సంధించారు.
Ramdev Baba letter to IMA: అల్లోపతి వైద్య విధానంపై విమర్శలతో వివాదాస్పదమైన యోగా గురు రాందేవ్ బాబా అంతటితో ఆగలేదు. ఇప్పుడు మరోసారి ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌కు సూటైన ప్రశ్నలు సంధించారు. రాందేవ్ బాబా వేసిన ప్రశ్నలు మళ్లీ ఇప్పుడు కొత్త వివాదాన్ని రాజేసింది.
తాజాగా రాందేవ్ బాబా వ్యాఖ్యలు చూస్తుంటే.. ఆయుర్వేద వైద్య విధానం వర్సెస్ అల్లోపతి వైద్యం అన్నట్లుగా సాగుతోంది. ఎప్పట్నించో ఉన్న వివాదమే ఇప్పుడు ఆనందయ్య కరోనా మందు నేపథ్యంలో మరోసారి తెరపైకి వస్తోంది. అల్లోపతి వైద్యవిధానంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పదమయ్యారు. అంతేకాదు కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో క్షమాపణలు చెప్పిన రాందేవ్ బాబా సోమవారం మళ్లీ సరికొత్త వాదనలతో ముందుకొచ్చారు. కొన్నింటికి అలోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఈ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ రాశారు.
✚ బీపీ, మధుమేహానికి అలోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు?
✚ థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల వద్ద మందులు ఉన్నాయా?
✚ కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి?
✚ పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు?
✚ అలోపతి సర్వగుణ సంపన్నమని భావించకూడదు. ఎందుకంటే దీని వయసు 200 ఏళ్లే..వీటితోపాటు మరిన్ని ప్రశ్నలనూ సంధించారు.
అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రాందేవ్ బాబా గుర్తు చేశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే..వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు.
मैं इंडियन मेडिकल एसोसिएशन व फार्मा कंपनियों से विनम्रता के साथ सीधे 25 सवाल पूछता हूँ- pic.twitter.com/ATVKlDc9tl
— स्वामी रामदेव (@yogrishiramdev) May 24, 2021
Read Also…. రామ్ దేవ్ బాబా ఆయుర్వేద మందు ‘కొరొనిల్’ ని కోవిద్ రోగులకు ఫ్రీగా ఇస్తాం, హర్యానా ప్రభుత్వం…