Worlds Powerful Passports: ప్రపంచ వ్యాప్తంగా పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకులో భారత్‌.. ఎన్నో ర్యాంకు అంటే..!

Worlds Powerful Passports: ప్రపంచ దేశాల్లో భారత్‌ పాస్‌పోర్టు విలువ మరింత పెరిగింది. వీసా లేకుండా మరిన్ని దేశాలకు వెళ్లేలా భారత్‌//

Worlds Powerful Passports: ప్రపంచ వ్యాప్తంగా పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకులో భారత్‌.. ఎన్నో ర్యాంకు అంటే..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 15, 2022 | 8:33 PM

Worlds Powerful Passports: ప్రపంచ దేశాల్లో భారత్‌ పాస్‌పోర్టు విలువ మరింత పెరిగింది. వీసా లేకుండా మరిన్ని దేశాలకు వెళ్లేలా భారత్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకు సాధించింది. తాజాగా విడుదల చేసిన జాబితాలో స్టాండెడ్‌ పాస్‌పోర్ట్‌ల జాబితాలో భారత్‌ ఏడు స్థానాలను మెరుగు పర్చుకుంది. గత సంవత్సరం 90వ స్థానంలో ఉన్న భారత్‌.. తాజా  ర్యాంకింగ్‌లో 83వ స్థానానికి చేరుకుంది. దీంతో వీసా లేకుండా ఇండయా పాస్‌పోర్టుతో 60 దేశాలు తిరిగి రావచ్చు. ప్రతి సంవత్సరం ప్రపంచ దేశాల్లో స్టాండెడ్‌ పాస్‌పోర్టు జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌ అనే కంపెనీ ప్రకటిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో భారత్‌ ర్యాంకింగ్‌లో దూసుకుపోయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) నుంచి సేకరించిన సమాచారం మేరకు హెన్లీ కంపెనీ 2022లో 199 దేశాలకు సంబంధించిన జాబితాను విడుదల చేసింది.

మొదటి స్థానాల్లో జపాన్‌, సింగపూర్‌.. ఇక ఈ పాస్‌పోర్టు జాబితాలో జపాన్‌, సింగపూర్‌ దేశాలు మొదటి స్థానంలో ఉండగా, ఈ రెండు దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 192 దేశాల్లో ప్రయాణించే వెసులుబాటు ఉందని తెలిపింది. ఇక జర్మనీ, దక్షిణ కొరియా పాస్‌పోర్టులు ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. అలాగే ఈ జాబితాలో ఫిన్లాండ్‌, లక్సెంబర్గ్‌, స్పెయిన్‌ దేశాలు 3వ స్థానం దక్కించుకున్నాయి. ఇక 4వ స్థానంలో ఫాన్స్‌, నెదర్లాండ్స్‌, స్వీడన్‌, డెనన్మార్క్‌ దేశాలు నిలిచాయి. అలాగే 6వ స్థానంలో అమెరికా, బ్రిటన్‌, న్యూజిలాండ్‌, నార్వే, స్విట్జర్లాండ్‌ దేశాలు ఉన్నాయి. గత సంవత్సరం ఈ దేశాలు 8వ స్థానంలో నిలిచాయి. వీసా లేకుండా 180 దేశాలలో తిరిగి రావచ్చు.

7వస్థానంలో ఆస్ట్రేలియా, కెనడా, గ్రీక్‌, మాల్టాలు నిలువగా, పోలాండ్‌, హంగరీలు 8వ స్థానం దక్కించుకున్నాయి. 9వ స్థానంలో లిథువేనియా, స్లొవేకియాలు ఉన్నాయి. 10వ స్థానంలో ఎస్టోనియా, లాట్వియా, స్లొవేనియాలు ఉన్నాయి. 2022 జాబితాలో మొదటి పది స్థానాల్లో యూరప్ దేశాలకు చెందిన పాస్‌పోర్ట్‌లే ఎక్కువగా ఉన్నాయి. అరబ్‌ దేశాల్లో యూఏఈ గోల్డెన్‌ వీసా 15 స్థానం, చైనా 64వ స్థానం ఉండగా, దాయాది దేశం పాకిస్థాన్‌ 108వ స్థానంలో ఉంది.

ఇవి కూడా చదవండి:

WhatsApp Blocked: వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరైనా బ్లాక్‌ చేశారా..? ఈ టిప్స్‌తో తెలుసుకోండిలా..!

Passwords: సోషల్‌ మీడియా అకౌంట్లకు ఇలాంటి పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటున్నారా..? ప్రమాదమే.. వెంటనే మార్చేయండి..!

హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
హైదరాబాద్‌లో కారు బీభత్సం.. డ్రైవర్ని చితకబాదిన స్థానికులు.
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
దైవ దర్శనానికి వెళ్లి ప్రదక్షిణలు చేస్తున్న యువకుడు. అంతలోనే షాక్
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
కూలిన మర్రి చెట్టు కింద శివలింగం ప్రత్యక్షం.. పోటెత్తిన జనం.!
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
గోండ్ కటిరా, పెరుగు కలిపి తింటే ఏమవుతుందో తెలుసా.?
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
అమెరికా వెళ్లాలనుకునేవారికి షాకింగ్‌ న్యూస్‌.! ఇండియన్స్ కి మరింత
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
బ్రష్ పై టూత్ పేస్ట్ ను ఎక్కువుగా పెడుతున్నారా.? అయితే ఇది మీకోసం
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
అల్లు అర్జున్ నార్త్‌ ఫ్యాన్స్‌కు ఇక పండగే.! గ్రాండ్‌గా ట్రైలర్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
కూలి పని చేసుకుంటున్న స్టార్ హీరో కొడుకు.! వీడియో వైరల్..
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
రాంగోపాల్ వర్మకు బిగుస్తున్న ఉచ్చు.. పోలీసుల చేతిలో వర్మ.!
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.
ఉత్తరాంధ్ర యాసలో అభిమానిని ఆటపట్టించిన మెగాస్టార్.! వీడియో వైరల్.