PM మోదీ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదానం.. ఒక్క రోజే 56,265 యూనిట్ల బ్లడ్ సేకరణ
‘biggest’ blood donation camp for PM Modi’s 75th birthday: ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ 'నమో కే నామ్ రక్తదాన్' బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పాల్గొన్ని ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఏకంగా 378 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి, 56,265 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దేశ చరిత్రలో ఒక నాయకుడి..

అహ్మదాబాద్, సెస్టెంబర్ 16: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 75వ వసంతంలోకి బుధవారం (సెప్టెంబర్ 17) అడుగుపెట్టనున్నారు. మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని గుజరాత్‌లో నిర్వహించారు. దీనిని అఖిల్ భారతీయ తేరాపంత్ యువక్ పరిషత్ (ABTYP) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అతిపెద్ద రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ ‘నమో కే నామ్ రక్తదాన్’ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు పాల్గొన్ని ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఏకంగా 378 మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి, 56,265 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. దేశ చరిత్రలో ఒక నాయకుడి పుట్టినరోజు కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఇంత భారీ మొత్తంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
నమో కే నామ్ రక్తదాన్ మెగా రక్తదాన శిబిరాన్ని గుజరాత్ ఆరోగ్య మంత్రి, గుజరాత్ ప్రభుత్వ అధికార ప్రతినిధి హృషికేష్ పటేల్ ఈ రోజు ఉదయం ఉదయం 6 గంటలకు స్టేడియంలో ప్రారంభించారు. గుజరాత్‌లోని 378 కి పైగా వివిధ ప్రదేశాలలో ఈ డ్రైవ్ ద్వారా మెగా రక్తదానం జరిగింది. తేరాపంత్ యువక్ పరిషత్ నుండి సుమారు 1500 మంది వాలంటీర్లు, జాతీయ సేవా పథకం (NSS) నుంచి 500 మందికి పైగా వాలంటీర్లు ఈ శిబిరంలో సహాయం అందించారు. గుజరాత్ అంతటా 75కి పైగా బ్లడ్ బ్యాంకులు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి.
A historic moment in India! 🇮🇳 On the success of #OperationSindoor and Honourable PM @narendramodi Birthday, State Government employee unions have set a world record with ‘Namo ke naam raktdan’. They organized 378 mega blood donation camps, collecting a massive 56,265 units of… pic.twitter.com/B0DM4Wqkzv
— Harsh Sanghavi (@sanghaviharsh) September 16, 2025
ఈ డ్రైవ్‌లో 75,000 మంది కార్మికులు, 4,000 మంది బ్లడ్ బ్యాంకులు, 5,000 మంది వైద్యులు, 25,000 మంది సాంకేతిక నిపుణులు, 1 లక్ష మందికి పైగా వాలంటీర్లు, 3 లక్షలకు పైగా దాతలు పాల్గొన్నట్లు సమాచారం. రక్తదాన అమృత్ మహోత్సవ్ 2.0 లో భాగంగా తేరాపంత్ యువక్ పరిషత్ నిర్వహిస్తున్న ఈ మెగా రక్తదాన కార్యక్రమానికి 50కి పైగా సామాజిక సంస్థలు, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు మద్దతు తెలిపాయి. ఇటీవలి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన తరువాత ప్రధానమంత్రి పుట్టినరోజున మెగా రక్తదాన కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో రక్తాన్ని సేకరించి, పేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా నేపాల్, శ్రీలంక, యుఎఇ, ఆస్ట్రేలియా, యుకెతో సహా 75 దేశాలలోనూ సుమారు 7,500 శిబిరాలను సేకరించేందుకు ప్లాన్ చేశారు. ఒకే రోజులో దాదాపు మూడు లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








