Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫేస్‌‌బుక్‌లో ప్రేమ.. పెళ్లి ఖరారు.. మూహూర్తం సమయానికి దిమాక్ ఖరాబ్

మీకు కూడా ఫేస్‌బుక్‌లో ఎవరైనా అమ్మాయి పరిచయమైందా...? ఆమెతో ఘాడ ప్రేమలో మునిగితేలుతున్నారా..? అయితే తస్మాత్ జాగ్రత్త.

Viral: ఫేస్‌‌బుక్‌లో ప్రేమ.. పెళ్లి ఖరారు.. మూహూర్తం సమయానికి దిమాక్ ఖరాబ్
Facebook Love
Follow us
Ram Naramaneni

|

Updated on: May 23, 2022 | 5:17 PM

karnataka: కర్ణాటకలోని మాండ్యా జిల్లా(Mandya District)లోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి ఫేస్‌బుక్ ద్వారా ఓ యువతి పరిచయమైంది. కొన్నాళ్లకు అది ప్రేమగా మారింది. జీవితం గురించి ఎన్నో, ఎన్నెన్నో ఊసులు చెప్పుకున్నారు.  ఈక్రమంలో ఆమెను విడిచి బతకడం సాధ్యం కాదని యువకుడు డిసైడైపోయాడు. ఆమెను కలిసి ఎలాగైనా తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే తనను కలవడానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు.. తల్లిదండ్రులకు తెలిస్తే గొడవైపోద్దని చెప్పింది. అయితే, ఆమెపై పెంచుకున్న ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువకుడు అదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. ఆమె కూడా ఓకే చెప్పింది. పెళ్లి గురించి మాట్లాడటానికి తన పినతల్లిని పంపుతున్నట్టు అతనికి చెప్పింది.  అనుకున్నట్టుగానే ఆమె పినతల్లి అతని ఇంటికి వచ్చింది. అబ్బాయి ప్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి పెళ్లి ఖాయం అనుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో వారికి తెలియకుండా యువకుడు పెళ్లి ఖర్చుల కోసమని ఆమె చేతిలో మూడున్నర లక్షలు పెట్టాడు. ఓ మఠంలో మ్యారేజ్‌కి ఏర్పాట్లు జరిగాయి. పెళ్లికి వచ్చిన యువతి ‘పినతల్లి’.. పెళ్లి కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు.

అయితే, ఆమె ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఆమె చెప్పింది విని పోలీసులే కంగుతిన్నారు. ఫేస్‌బుక్‌లో యువకుడికి పరిచయమైన ఆ యువతి ఈ ‘పిన్నమ్మే’నని తెలిసి అవాక్కయారు. వారే కాదు.. విషయం తెలిసిన యువకుడికి మూర్ఛ వచ్చినంత పనైంది. తన ఫొటోకు బదులుగా మరో యువతి ఫొటోను పెట్టి యువకుడిని బోల్తా కొట్టించినట్టు అంగీకరించింది. అతడి నుంచి తీసుకున్న డబ్బును వెనక్కి ఇచ్చేందుకు ఆమె అంగీకరించడంతో రాజీ కుదిరింది. కథ సుఖాంతమైంది. అర్ధమైందిగా.. ఫేస్‌బుక్‌ ప్రేమలు.. పెళ్లిళ్లంటే ఇలాగే ఉంటాయి మరి.. జాగ్రత్త.

Women Cheating 

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..