AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISI: భారత్ లో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ కుట్ర.. రైల్వే ట్రాకులు పేల్చేందుకు మాస్టర్ ప్లాన్

దేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ రచించాయని తెలిపింది. పంజాబ్‌ సహా పొరుగు....

ISI: భారత్ లో విధ్వంసానికి పాక్ ఐఎస్ఐ కుట్ర.. రైల్వే ట్రాకులు పేల్చేందుకు మాస్టర్ ప్లాన్
Track
Ganesh Mudavath
|

Updated on: May 23, 2022 | 4:54 PM

Share

దేశంలో అల్లర్లు, అరాచకాలు సృష్టించేందుకు పాక్ ఐఎస్‌ఐ కుట్రలు పన్నుతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేలుళ్లకు పాల్పడేందుకు మాస్టర్ ప్లాన్ రచించాయని తెలిపింది. పంజాబ్‌ సహా పొరుగు రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను పేల్చేందుకు ప్లాన్‌ చేసినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇందుకు ఐఎస్‌ఐ తమ మద్దతుదారులకు నిధులు కూడా పంపుతున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఉన్న పాక్‌ స్లీపర్‌ సెల్స్‌కు తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు భారీ మొత్తంలో డబ్బులు చెల్లిస్తున్నారని వివరించాయి. ఖలిస్తాన్‌ ఉగ్రవాదులను కూడా దాడులకు ఐఎస్‌ఐ ఉసిగొల్పుతోందని నిఘా వర్గాల ద్వారా తెలుస్తోంది. పంజాబ్‌లో శాంతి, సామరస్యాలకు విఘాతం కలిగించేందుకు భారత వ్యతిరేక శక్తులు పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నట్టు నిఘా సంస్థలు రుజువు చేస్తున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను హరియాణా పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ నుంచి డ్రోన్‌ ద్వారా ఈ ఆయుధాలు వచ్చినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నారు.

ఉగ్ర కుట్ర జరుగుతుందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. రైల్వే ట్రాకుల వెంట భద్రతను కట్టుదిట్టం చేశాయి. పంజాబ్, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లోని రైలు మార్గాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటలు సాగకపోవడంతో పంజాబ్‌పై గురిపెట్టారని ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన సీనియర్‌ అధికారి వెల్లడించారు. ఇటీవల హరియాణలోని కర్నాల్ జిల్లాలో నలుగురు సిక్కు తీవ్రవాదులను అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

ఇవీ చదవండి

iPhone WhatsApp: ఐఫోన్‌ యూజర్లకు షాకిచ్చిన వాట్సాప్‌.. ఈ మోడళ్లలో సేవలు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..!

“ఫన్” టాస్టిక్ ఈవెంట్ లో రచ్చ చేసిన విక్టరీ.. వైరల్ అవుతున్న వెంకటేష్ పిక్స్

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్