Kerala: విస్మయ కేసులో కోర్టు కీలక తీర్పు.. భర్తే దోషిగా తేల్చిన న్యాయస్థానం

కేరళ(Kerala) లోని కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్ చదువుతున్న విస్మయ నాయర్ కు.. మోటార్ వెహికిల్ డిపార్ట్ మెంట్ కు చెందిన కిరణ్ తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వారి కాపురంలో....

Kerala: విస్మయ కేసులో కోర్టు కీలక తీర్పు.. భర్తే దోషిగా తేల్చిన న్యాయస్థానం
Vismaya
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 23, 2022 | 5:27 PM

కేరళ(Kerala) లోని కొల్లాంలో ఆయుర్వేద మెడిసిన్ చదువుతున్న విస్మయ నాయర్ కు.. మోటార్ వెహికిల్ డిపార్ట్ మెంట్ కు చెందిన కిరణ్ తో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు. కొన్నాళ్లు బాగానే సాగిన వారి కాపురంలో అదనపు కట్నం(Dowry Case) చిచ్చు రేపింది. పుట్టింటి నుంచి అదనంగా డబ్బు తీసుకురావాలంటా కిరణ్ విస్మయ ను వేధించేవాడు. అతని వేధింపులు తాళలేక విస్మయ తల్లిదండ్రులు కిరణ్ కు కారు కొనిచ్చారు. అయితే.. తాను గవర్నమెంట్ ఎంప్లా్య్ నని, వేరే మోడల్ కారు కావాలంటూ విస్మయను తీవ్రంగా హింసించాడు. ఈ పరిస్థితుల్లో విస్మయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దేశంలో జరుగుతున్న వరకట్న మరణాలపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఆందోళనలకూ దిగారు. విస్మయ ఉరి వేసుకునే ముందు తనను బలవంతంగా ఇక్కడ ఉంచాలని చూస్తే మీరు నన్ను మళ్లీ చూడలేరని తన తండ్రితో ఆవేదన వ్యక్తం చేసింది. వీరి వేధింపులను భరించలేకున్నానని, తనకు వెనక్కు వచ్చేయాలని ఉందని కన్నీటి పర్యంతమైంది.

ఈ ఘటనపై పోలీసులు విస్మయ అత్తింటి వారిపై వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు. ఐపీసీలోని సెక్షన్‌లతో పాటు వరకట్న వేధింపుల చట్టంలోని సెక్షన్‌లు చార్జ్‌షీట్‌లో పొందుపర్చారు. ఈ వ్యవహారంతో విస్మయ భర్త కిరణ్‌ ప్రభుత్వ ఉద్యోగం కూడా పోయింది. ఇంతకాలం బెయిల్‌ మీద అతను బయట ఉన్నాడు. ఈ కేసులో ఇవాళ తీర్పు వెలువడింది. అతని బెయిల్‌ రద్దు అయ్యింది. కోర్టు తీర్పతో కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొల్లాం అదనపు సెషన్స్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో ఆడియో, తాను వేధింపులకు గురైనట్లు ఫొటోలు పంపిన విస్మయ.. కీలక ఆధారాలను అందించినట్లు అయ్యింది. ఈ సాక్ష్యాల ఆధారంగా కోర్టు అతన్ని దోషిగా ప్రకటించింది. మంగళవారం అతనికి విధించబోయే శిక్షను ఖరారు చేయనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Mango Store Tips: మామిడి పండ్లను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే ఇలా చేయండి..

Health Tips: బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే ఈ 4 ఆహారాలు డైట్‌లో ఉండాల్సిందే..!