వీరప్పన్ కిల్లర్‌కు.. కశ్మీర్ పగ్గాలు.?

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ ను నియమించనున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్, లఢక్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. దీనితో కశ్మీర్‌కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ […]

వీరప్పన్ కిల్లర్‌కు.. కశ్మీర్ పగ్గాలు.?
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 10, 2019 | 4:10 PM

జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్ ను నియమించనున్నట్లు సమాచారం. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్, లఢక్‌ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారాయి. దీనితో కశ్మీర్‌కు కేంద్రం తరపున ప్రతినిధిగా లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు. ఇక ప్రస్తుతం రెండు రాష్ట్రాల వ్యవహారాలను సత్యపాల్ మాలిక్ చూస్తున్న విషయం తెలిసిందే. అటు రెండు ప్రాంతాలకు వేర్వేరుగా లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించి.. అక్కడ పరిస్థితులను అదుపులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రిటైర్డ్ ఐపీఎస్ విజయ్ కుమార్‌ను నియమించే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ వర్గాల సమాచారం.

మరోవైపు విజయ్ కుమార్‌తో పాటు ఐపీఎస్ దినేశ్వర్ శర్మ పేరు కూడా వినిపిస్తోంది. ఇకపోతే కొద్దిరోజుల క్రిందట తెలంగాణ గవర్నర్ నరసింహన్‌ను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పంపుతారని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా విజయ్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది.

1975 తమిళనాడు బ్యాచ్‌కు చెందిన విజయ్ కుమార్ 2004 అక్టోబర్‌లో గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను అంతమొందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా.. ఇక 2018లో జమ్మూకాశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుడిగా పని చేశారు.