AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మొఘలే ఆజం ‘ కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ !

ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కులం కానివారనో, ఆస్తులు, అంతస్థుల తారతమ్యం విపరీతంగా ఉందనో ఓ కొత్త జంటపై దాడి చేసే తలిదండ్రులు, వారి బంధువుల ఆటలు ఇక సాగవంటోంది రాజస్తాన్ ప్రభుత్వం.. ఇలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర పోలీసులు అంటున్నారు. 2019 హానర్ కిల్లింగ్ (ప్రివెన్షన్) బిల్లు పేరిట ప్రభుత్వం తెచ్చిన బిల్లును వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తాజాగా తమ ట్విటర్ లో ట్వీట్ […]

' మొఘలే ఆజం ' కాలం కాదిది.. ఎవరైనా అలా చేశారో..ఖబర్దార్ !
Pardhasaradhi Peri
|

Updated on: Aug 10, 2019 | 5:16 PM

Share

ఈ మధ్య పెరిగిపోతున్న పరువు హత్యలపై రాజస్థాన్ ప్రభుత్వం కొరడా ఝళిపించింది. కులం కానివారనో, ఆస్తులు, అంతస్థుల తారతమ్యం విపరీతంగా ఉందనో ఓ కొత్త జంటపై దాడి చేసే తలిదండ్రులు, వారి బంధువుల ఆటలు ఇక సాగవంటోంది రాజస్తాన్ ప్రభుత్వం.. ఇలాంటివారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆ రాష్ట్ర పోలీసులు అంటున్నారు. 2019 హానర్ కిల్లింగ్ (ప్రివెన్షన్) బిల్లు పేరిట ప్రభుత్వం తెచ్చిన బిల్లును వారు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ తాజాగా తమ ట్విటర్ లో ట్వీట్ చేశారు. ‘ నాటి హిందీ చిత్రం ‘ మొఘలే ఆజం ‘ శకం కాదిది.. ఆ సినిమాలో దిలీప్ కుమార్, మధుబాలల ‘ ప్రేమాయణాన్ని సమాజం చీదరించుకుంది.. పెద్దలు వారి లవ్ ని నిరాకరించారు. అది నాటి మాట..కానీ ఇప్పుడా పప్పులు చెల్లవు.. పెద్దలను ఎదిరించి ఏ జంట అయినా పెళ్లి చేసుకుంటే.. ఆ జంటమీద దాడులు జరిపేవారికి యావజ్జీవ జైలు శిక్ష, రూ. 5 లక్షల జరిమానా విధిస్తాం ‘ అని ఈ ట్వీట్ లో హెచ్చరించారు. పరువు హత్యలకు పాల్పడేవారికి ఇకపై ఇలాంటి కఠిన శిక్షలు తప్పవు అని పేర్కొన్నారు. లవ్ అన్నది నేరం కాదని కూడా వారు ముక్తాయింపునిచ్చారు. ఈ సరికొత్త వార్నింగ్ బాగా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు రాజస్థాన్ పోలీసులు చెబుతున్నారు. మరి పరువు హత్యలను అదుపు చేయడానికి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటాయా? కొత్త బిల్లులు తెస్తాయా..? చూడాల్సిందే !

Follow Us
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
రోజుకు ఒక్కసారి ముఖానికి ఇది రాస్తే చాలు.. పైసా ఖర్చు లేకుండా..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
అరె ఏంట్రా ఇదీ.. దొంగతనానికి వెళ్లి లుంగీ డ్యాన్స్.. చివరకు..
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
ఏళ్ల తరబడి స్మోకింగ్ చేసినా క్యాన్సర్ రాలేదా?.. అసలు కారణం ఇదేనట!
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
స్కాన్‌ చేయాలంటే.. కళ్లను తెరిచి పట్టుకోవాల్సిందేనా..?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
చంటి పిల్లలకు విటమిన్‌-ఏ ఎందుకు వేస్తారు?.. వేయకుంటే ఏమవుతుంది?
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
గ్రామ సింహానికే సవాల్‌..! కోడిపుంజు ధైర్యానికి షాకైన నెటిజన్లు..
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
తెలంగాణలో స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ఇలా ఉండనున్నాయి..!
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
మూడు జెండాలు.. మూడు ఎజెండాలు.. నీటి పంపకాలపై ఎందుకీ రచ్చ?
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
యూనిక్ లుక్‌తో నథింగ్ ఫోన్ 3ఏ.. ఫీచర్లు ఇవే
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై
ఇన్నాళ్లూ మనం చేసిన అతిపెద్ద పొరపాటు ఇదే.. నాన్‌స్టిక్ గిన్నెలపై