AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PK: ‘పీకే’కు నిజంగానే అంత సీన్ ఉందా..? కొత్త పార్టీ యోచన వార్కౌట్ అవుతుందా..?

ఇండియన్‌ పాలిటిక్స్‌లో ఆయనో సంచలనం. అలాగని రాజకీయాలు చేసిందేం లేదు. ఒక సారి ఆ పార్టీ అంటారు... మరోసారి ఇంకో పార్టీ అంటారు.. ఇప్పుడు ఏకంగా కొత్త పార్టీ పెట్టేస్తానంటున్నారు? ఇంతకీ ఆయనెవరు? అసలాయనకు అంత సీన్‌ ఉందా?

PK: 'పీకే'కు నిజంగానే అంత సీన్ ఉందా..? కొత్త పార్టీ యోచన వార్కౌట్ అవుతుందా..?
Prashant Kishor
Sanjay Kasula
|

Updated on: May 03, 2022 | 8:10 PM

Share

రాజకీయ పార్టీలకు వ్యూహాలను అమ్ముకుంటూ వ్యాపారం చేసే.. ప్రముఖ పొలిటికల్‌ స్ట్రాటజిస్టు ప్రశాంత్‌ కిశోర్‌(Prashant Kishor) అలియాస్‌ పీకే(PK) సంచలనం నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించి… పొలిటికల్‌గా పెద్ద ట్విస్ట్‌ ఇచ్చారు. తన రాజకీయ ప్రస్థానం బీహార్ నుంచే ప్రారంభమవుతుందని ట్విట్టర్‌లో ప్రకటించారు. అయితే, పీకే ప్రకటనపై దేశవ్యాప్తంగా రకరకాల చర్చలు మొదలయ్యాయి. పీకే మాటకు విలువెంత? అనే యాంగిల్‌లో ఎనలిస్టులు అప్పుడే ఏకిపారేస్తున్నారు. ఏ ఒక్క పార్టీతోనూ సరిగ్గా ప్రయాణించని పీకే… చెప్పిన మాట మీద గట్టిగా నిలబడని పీకే… కొత్త పార్టీ పెడతానంటే నమ్మేదెట్టా? అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

దశాబ్దకాలానికి పైగా దేశ రాజకీయాల్లో..పీకే పేరు మార్మోగుతోంది. రాజకీయ పార్టీలకు వ్యూహాలు అందించేందుకు, గ్రౌండ్‌ రియాలిటీ తెలుసుకునేలా సర్వేలు చేసేందుకు ఐప్యాక్‌ అనే సంస్థను ప్రారంభించిన ప్రశాంత్‌ కిషోర్‌… ఇండియన్‌ పాలిటిక్స్‌లో సరికొత్త శకానికి నాందిపలికారు. గతంలో బీజేపీకి.. ఆ తర్వాత బీహార్‌లో నితీష్‌ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు పీకే. జనతాదళ్‌ ఉపాధ్యక్షుడిగానూ పనిచేసిన పీకే.. నితీష్‌ తర్వాతి స్థానం దక్కింది. అయితే, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించడంతో నితీష్, పీకేల మధ్య మనస్పర్థలు వచ్చాయి. 2020 జనవరిలో ఆ పార్టీ నుంచి పీకేను బహిష్కరించారు.

పశ్చిమబెంగాల్లో దీదీకి, ఏపీలో జగన్‌కి, ఢిల్లీలో కేజ్రీవాల్‌కు వ్యూహకర్త పనిచేసిన పీకే.. వారి పార్టీలకు గ్రాండ్‌ విక్టరీ దక్కేలా చేశారు. అంతెందుకు, ఇప్పటి ప్రధాని, ఒకనాటి గుజరాత్‌ సీఎం.. నరేంద్రమోడీకి కూడా 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సలహాలు, సూచనలు ఇచ్చారు పీకే. అప్పట్నుంచే..బాగా ఫేమస్సయిన పీకే.. బలమైన పొలిటికల్‌ వ్యూహకర్తగా పేరు సంపాదించారు. ఇటీవల పూర్వవైభవం కోసం పరితపిస్తున్న కాంగ్రెస్‌ను ఉద్ధరిస్తానంటూ ముందుకొచ్చిన పీకే.. మొన్నటి వరకూ ఆ పార్టీలో జాయిన్ అవుతారనీ జోరుగా ప్రచారం జరిగింది.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాతో రోజుల తరబడి సమావేశాలు నిర్వహించిన పీకే… పార్టీ అభివృద్ధి ఎలా? అనేదానిపై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్లూ ఇచ్చారు. అయితే, ఆయన కాంగ్రెస్‌లో కోరుతున్నది.. అత్యంత కీలకమైన పోస్టనే విషయం గ్రహించిన హైకమాండ్‌ పీకేను లైట్‌ తీసుకుంది. అందుకే, కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే.. దాన్ని డిలీట్‌ చేశారు పీకే. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని ట్విస్ట్ ఇచ్చారు. ఇటు, తెలంగాణలో టీఆర్‌ఎస్‌తోనూ కలిసి పనిచేస్తున్నారు పీకే.

సీన్‌ కట్ చేస్తే.. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్లు పీకే ట్వీట్‌ చేయడం దుమారం రేపుతోంది. వ్యూహకర్తగా ఓకే… మరి రాజకీయ నాయకుడిగా పీకే సీన్‌ ఎంత? ఎన్ని మార్కులెయ్యొచ్చు? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే, రాజకీయ పార్టీలకు వ్యూహకర్తగా తప్ప… ప్రజలకోసం పాటుపడిన వ్యక్తిగా పీకేకు పెద్దగా పేరు లేదు. అంతేకాదు, ఆయన ప్రజాక్షేత్రంలో సర్వేలు తప్ప ప్రజలకోసం చేసిందేమీ లేదన్న అభిప్రాయమూ ఉంది. ఇండియాలాంటి దేశంలో ఒక పార్టీ పెట్టి రాణించడమంటే అంత ఈజీ కాదు. ఉద్ధండులెందరో పార్టీ పెట్టి మళ్లీ మూతేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి వారితో పోలిస్తే.. కేవలం వ్యూహాల్ని తప్ప… పొలిటికల్‌ ఇమేజ్‌లేని పీకే ఎంత? అనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఎనలిస్టులు. ఒకవేళ పార్టీ పెట్టినా… పీకే ఎజెండా ఏమిటి? ప్రజలకు ఇప్పటివరకూ ఆయన వల్ల జరిగిన మేలేమిటి? భవిష్యత్తులో చేసేదేంటి? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు పీకే, ప్రజల్ని ఏమని ఓట్లు అడుగుతారు? అనేవారూ లేకపోలేదు. ఒక్కోసారి ఒక్కోపార్టీతో కలిసి పనిచేసే పీకేకు అసలు ఓ సిద్ధాంతమంటూ ఎక్కడుంది? అధికారమే తన సిద్ధాంతమైతే అది అందుకోవడం అంత ఈజీ కాదన్నది విశ్లేషకుల మాట.

ఒక పార్టీతో ఆగని పీకే… ఒక స్టాండ్‌పై నిలబడని పీకే… ఒక సిద్ధాంతమంటూ లేని పీకే… రాజకీయ పార్టీని ఎలా నడుపుతాడన్నది విశ్లేషకుల కొశ్చన్‌. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌ విషయంలో అలా ట్వీట్‌ పెట్టి.. మరు నిమిషంలో దాన్ని డిలీట్‌ చేసి ట్విస్టిచ్చిన పీకే… పొలిటికల్‌ పార్టీ విషయంలోనూ అలాగే చేస్తారేమోనన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?