Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Party Video: నైట్‌క్లబ్‌లో రాహల్‌గాంధీ వీడియోపై రాజకీయ రగడ.. జవదేకర్‌ ఫోటోతో కాంగ్రెస్‌ కౌంటర్‌

రాహుల్‌ వీడియోకు కౌంటర్‌గా జవదేకర్‌ పార్టీ ఫోటోను షేర్‌ చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌. నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ వీడియో సంచలనం రేపుతోంది.

Rahul Gandhi Party Video: నైట్‌క్లబ్‌లో రాహల్‌గాంధీ వీడియోపై రాజకీయ రగడ.. జవదేకర్‌ ఫోటోతో కాంగ్రెస్‌ కౌంటర్‌
Prakash Javdekar Popped
Follow us
Sanjay Kasula

|

Updated on: May 03, 2022 | 7:15 PM

నేపాల్‌ నైట్‌క్లబ్‌లో రాహల్‌గాంధీ(Rahul Gandhi)వీడియోపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఫ్రెండ్‌ పెళ్లికి రాహుల్‌ వెళ్తే బీజేపీ నేతలు రాద్దాతం చేయడం తగదని కాంగ్రెస్‌ మండిపడింది. రాహుల్‌ వీడియోకు కౌంటర్‌గా జవదేకర్‌ పార్టీ ఫోటోను షేర్‌ చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌. నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ వీడియో సంచలనం రేపుతోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌ లోని జోథ్‌పూర్‌లో అల్లర్లు చెలరేగుతుంటే రాహుల్‌ విదేశాల్లో విందులు చేసుకుంటున్నారని విమర్శించారు బీజేపీ నేతలు. అయితే మయన్మార్‌లో నేపాల్‌ రాయబారిగా పనిచేసిన భీమ్‌ ఉదాస్‌..తన కుమార్తె వివాహానికి రాహుల్‌ను ఆహ్వానించారని , ఆ వివాహానికి హాజరయ్యేందుకే రాహుల్‌ ఖాట్మాండు వెళ్లారని కాంగ్రెస్‌ కౌంటరిచ్చింది. రాహుల్‌ గాంధీ నేపాల్‌ టూర్‌పై బీజేపీ విమర్శలపై విరుచుకుపడింది కాంగ్రెస్‌.

ప్రధాని మోదీలా పాక్‌ మాజీ ప్రధాని పుట్టినరోజుకు పిలవకున్నా వెళ్లలేదని కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా. ఆహ్వానిస్తేనే జర్నలిస్టైన ఫ్రెండ్‌ మ్యారేజ్‌కు రాహుల్‌ వెళ్లారని వివరణ ఇచ్చారు. వివాహ వేడుకకు వెళ్లడం నేరం కాదు.. వివాహానికి హాజరవడం చట్టవిరుద్ధమని..ఫ్రెండ్స్‌ ఉండటం నేరమని ఇప్పుడు బీజేపీ ప్రకటించవచ్చన్నారు సూర్జేవాలా.

రాహుల్‌పై బీజేపీ నేతల విమర్శలకు కాంగ్రెస్‌ ఎదురుదాడి చేసింది. బీజేపీ సీనియర్‌ నేత , కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్‌ జవదేవకర్‌ షాంపేన్‌ బాటిల్‌ను ఓపెన్‌ చేస్తున్న ఫోటోను ట్వీట్‌ చేశారు తెలంగాణ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌. ఫోటోలో ఉన్నది ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నేతలు పెళ్లిళ్లకు హాజరవడం కూడా తప్పవుతుందా ? అని ప్రశ్నించారు మాణిక్కం ఠాకూర్‌. భారతీయ సంస్కృతికి తామే ప్రతినిధులమని చెప్పుకోవడానికి బీజేపీ నేతలు ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. పెళ్లి ఫంక్షన్‌కెళ్తే దాన్ని కూడా రాద్ధాంతం చేస్తారా అంటూ ఫైరయ్యారు జగ్గారెడ్డి. అలా, వీడియోలు తీయడం మొదలుపెడితే… బీజేపీ, టీఆర్‌ఎస్‌ లీడర్స్‌ తట్టుకోలేరంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తన నియోజకవర్గం వయనాడ్‌ ప్రజల బాధలను పట్టించుకోకుండా రాహుల్‌ విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది.

ఇవి కూడా చదవండి: Rahul Gandhi: రాహుల్ పక్కనే ఉన్న యువతి ఎవరంటే.. కీలక ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ..

Rahul Gandhi: బీజేపీ చేతికి మరో అస్త్రం.. రాహుల్ గాంధీ రాజకీయ “అపరిపక్వత”..?