AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sabarimala: శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు

శబరిమలలో అడవి పంది దాడిలో తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తీర్థయాత్రకు వచ్చిన తన తండ్రి మనోజ్‌తో సహా 21 మంది సభ్యుల బృందంలో  ఉన్న చిన్నారి శ్రీహరి మరక్కూట్టం నుండి శరంకుతి మీదుగా వలియ నడప్పంతల్ ప్రాంతానికి దిగుతుండగా సన్నిధానం కెఎస్‌ఈబీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.

Sabarimala: శబరిమలలో చిన్నారిపై అడవి పందుల దాడి.. ఆందోళనలో అయ్యప్ప భక్తులు
Sabarimala
Velpula Bharath Rao
|

Updated on: Dec 22, 2024 | 12:54 PM

Share

శబరిమల సన్నిధానం సమీపంలో శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో అడవి పంది దాడిలో తొమ్మిదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. చిన్నారి శ్రీహరి స్వస్థలం అలప్పుజాలోని పజవీడు చెందినవాడు. తీర్థయాత్రకు వచ్చిన తన తండ్రి మనోజ్‌తో సహా 21 మంది సభ్యుల బృందంలో  అతను ఓ సభ్యుడు. ఈ బృందం మరక్కూట్టం నుండి శరంకుతి మీదుగా వలియ నడప్పంతల్ ప్రాంతానికి దిగుతుండగా సన్నిధానం కెఎస్‌ఈబీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన జరిగింది.అడవి పంది  దాడి చేయడంతో శ్రీహరి కుడి మోకాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం సన్నిధానం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు వారాల క్రితం పోలీసు బ్యారక్‌లో భోజనం చేసి బయటకు వచ్చిన కన్నూర్‌కు చెందిన ఏఎస్‌ఐ అడవి పంది దాడిలో తీవ్ర గాయలపాలయ్యాడు.

ఇది ఇలా ఉంటే శబరిమలకు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు పోటెత్తారు. ఈసారి మండల పూజలు, మకర దీపాల సమయంలో భక్తుల రద్దీని తగ్గించాలని అధికారులు యోచించారు. వర్చువల్ క్యూను తగ్గించడం, స్పాట్ బుకింగ్‌ను నివారించడం మాత్రమే ఎంపిక అని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25న వర్చువల్ క్యూలో 54 వేల మందిని మాత్రమే అయ్యప్ప దర్శనానికి అనుమతించనున్నారు. 26న 60 వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని దేవస్థానం బోర్డు తెలిపింది. మండల పరిధిలోని నిన్న సన్నిధానానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నిన్న ఒక్కరోజే 96,853 మంది అయ్యప్ప దర్శనం చేసుకున్నారు.

గత కొద్ది రోజులుగా రద్దీ దృష్ట్యా మండల పూజలు, మకర పంతులకు భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఆంక్షలు విధించారు. కాగా, జనవరి 12న 60,000, 13న 50,000, 14న 40,000గా పరిమితి నిర్ణయించారు. ఈ రోజుల్లో స్పాట్ బుకింగ్‌ను నివారించనున్నట్లు అధికారులు తెలిపారు. అయితే హైకోర్టు తిర్పు తర్వాతే ఈ విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి