Quit India Slogan: ‘క్విట్ ఇండియా’ నినాదం సృష్టికర్త మహాత్మాగాంధీ కాదు..మరెవరో మీరే తెలుసుకోండి..
భారతీయులందరినీ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములను చేసిన ఉద్యమం 'క్విట్ ఇండియా'.. ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లిపోండి అంటూ ఉవ్వెత్తున్న సాగిన ఈఉద్యమ నినాదాన్ని ఇచ్చింది మహాత్మాగాంధీ అని మనందరికీ తెలుసు.. అయితే ఈనినాదాన్ని సృష్టించింది మాత్రం గాంధీ కాదు..
Azadi Ka Amrit Mahotsav: భారత స్వాతంత్య్ర ఉద్యమాన్ని మలుపు తిప్పిన నినాదం.. భారతీయులందరినీ స్వాతంత్య్ర పోరాటంలో భాగస్వాములను చేసిన ఉద్యమం ‘క్విట్ ఇండియా’.. ఆంగ్లేయులు దేశాన్ని వదిలి వెళ్లిపోండి అంటూ ఉవ్వెత్తున్న సాగిన ఈఉద్యమ నినాదాన్ని ఇచ్చింది మహాత్మాగాంధీ అని మనందరికీ తెలుసు.. అయితే ఈనినాదాన్ని సృష్టించింది మాత్రం గాంధీ కాదు..మరెవరో తెలుసుకోవాలనుకుంటున్నారా..రీడ్ దిస్ స్టోరీ..
దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో 1942 ఆగష్టు 8వ తేదీన క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైంది. ఆరోజు నుంచి దేశ వ్యాప్తంగా స్వాతంత్య్ర సంగ్రామం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇలాంటి ఉద్యమ నినాదాన్ని మహాత్మాగాంధీ కాయిన్ చేశారని అంతా అనుకుంటుంటారు.. కాని ఆ నినాదాన్ని కాయిన్ చేసింది అప్పట్లో ముంబై మేయర్ గా పనిచేస్తున్న యూసుఫ్ మెహరల్లీ.. మేయర్ పదవికి ఎన్నికైన తొలి సోషలిస్టు కూడా ఆయన. దేశ స్వాతంత్య్ర పోరాటంలో 8సార్లు జైలుకెళ్లిన యోధుడు యూసుఫ్ మెహరల్లీ, స్వాతంత్య్ర పోరాటంలో కీలకంగా నిలిచిన నినాదం ఎలా వచ్చిందో ‘గాంధీ అండ్ బాంబే’ పుస్తకంలో కె.గోపాలస్వామి రాశారు.
భారత స్వాతంత్య్ర పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యూహ రచన చేస్తున్న మహాత్మా గాంధీ.. ముంబైలో కొందరు నాయకులతో సమావేశమైనప్పుడు స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు మంచి నినాదాలను సూచించాల్సిందిగా కోరారు. ఆసమయంలో గెటవుట్, రిట్రీట్ ఆర్ విత్ డ్రా పదాలను కొందరు నాయకులు సూచించగా.. అక్కడే ఉన్న యూసుఫ్ మెహరల్లీ క్విట్ ఇండియా పదాన్ని సూచించారు. వెంటనే ఇది విన్న మహత్మా గాంధీ యూసుఫ్ మెహరల్లీని అభినందించి..వెంటనే ఆపదాన్ని ఆమోదించారు. ఆవిషయాన్ని అదే సమావేశంలో పాల్గొన్న శాంతికుమార్ మొరార్జీ ద్వారా తెసుకున్న గోపాలస్వామి పుస్తకంలో పొందుపర్చారు. ఈనినాదం అవసరాన్ని, ఆవశ్యకతను ప్రజలకు తెలియజేసేందుకు పుస్తకాలను ప్రచురించగా..అవ్వన్నీ కొద్దిరోజుల్లో సేల్ అయిపోయాయి. ఆకర్షణీయమైన నినాదాలను కాయిన్ చేయడంలో యూసుఫ్ మెహరల్లీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రజల్లోకి విస్తృతంగా చొచ్చుకెళ్లిన సైమన్ గో బ్యాక్ నినాదాన్ని 1928వ సంవత్సరంలో యూసుఫ్ మెహరల్లీనే కాయిన్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..