AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Azadi Ka Amrit Mahotsav: రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. వీడియో

విద్యార్థుల్లో దేశభక్తిని చాటి చెప్పేందుకు.. స్వాంతత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు.

Azadi Ka Amrit Mahotsav: రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ.. వీడియో
National Flag
Shaik Madar Saheb
|

Updated on: Aug 05, 2022 | 7:12 PM

Share

Azadi Ka Amrit Mahotsav: ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా కాకినాడ రూరల్ మండలం వలసపాకుల గ్రామంలో కేంద్రీయ విద్యాలయం విద్యార్థులు 75మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని పరిసర ప్రాంతాల్లో ర్యాలీ నిర్వహిస్తూ మేరా భారత్ మహాన్.. అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు.. 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ చేపట్టామని కేంద్ర విద్యాలయ ప్రిన్సిపాల్ల్ బి శేఖర్ తెలిపారు. విద్యార్థుల్లో దేశభక్తిని చాటి చెప్పేందుకు.. స్వాంతత్ర్య సమరయోధులను గుర్తు చేసుకుంటూ 75 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల ర్యాలీతో వలసపాకుల గ్రామం త్రివర్ణ శోభితంగా మారింది.

కాగా.. ఆగస్టు15 వేడుకలకు 10 రోజుల సమయం మాత్రమే ఉంది. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని..ఇంటింటికి జాతీయ జెండాను ప్రభుత్వం అందించనుంది. హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రభుత్వం ఇంటింటికి త్రివర్ణ పతాకాలను పంపిణీ చేయనుంది.

అందరి ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రభుత్వం ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏర్పాట్లను కూడా భారీగా చేస్తోంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో భారతదేశం సాధించిన ఘనతలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం..