నా హక్కులేవీ ? కన్నీటి పర్యంతమైన నిర్భయ తల్లి ఆశాదేవి
నిర్భయ తల్లి ఆశాదేవి బుధవారం ఢిల్లీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. జడ్జి ముందు చేతులు జోడించిన ఆమె.. ఈ కేసులో దోషులు నలుగురినీ ఏ తేదీన ఉరితీస్తారని ప్రశ్నించారు. . న్యాయం కోసం పోరాడుతున్న నా హక్కులేమయ్యాయి అన్నారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన పాత లాయర్ ని తొలగించానని, కొత్త న్యాయవాదిని కుదుర్చుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరగా.. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు […]
నిర్భయ తల్లి ఆశాదేవి బుధవారం ఢిల్లీ కోర్టులో కన్నీటి పర్యంతమయ్యారు. జడ్జి ముందు చేతులు జోడించిన ఆమె.. ఈ కేసులో దోషులు నలుగురినీ ఏ తేదీన ఉరితీస్తారని ప్రశ్నించారు. . న్యాయం కోసం పోరాడుతున్న నా హక్కులేమయ్యాయి అన్నారు. దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా తన పాత లాయర్ ని తొలగించానని, కొత్త న్యాయవాదిని కుదుర్చుకునేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని కోరగా.. అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా.. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు లాయరంటూ ఎవరూ లేరని పవన్ గుప్తా చెప్పడంతో.. తక్షణ ప్రాతిపదికపై అతనికి లీగల్ ఎయిడ్ ఇచ్చేందుకు కోర్టు సంసిధ్ధత వ్యక్తం చేసింది. అయితే ఈ ఎత్తుగడలన్నీ కేసును జాప్యం చేసేందుకేనని నిర్భయ తల్లి ఆరోపించారు. ఈ దోషుల న్యాయ సహాయాలన్నీక్లియర్ చేయాలని, వీరికి త్వరగా ఉరి శిక్ష పడేలా చూడాలని తాను ఏడాదిన్నరగా కోర్టును కోరుతున్నానని ఆమె పేర్కొన్నారు. హైకోర్టు వారం రోజుల వ్యవధిని ఇచ్చింది గనుక ఇటీవల మీరు డెత్ వారెంట్ జారీ చేయలేదని, ఇప్పుడు ఈ దోషుల్లో ఒకడు తనకు న్యాయవాది లేరంటున్నాడని చెప్పిన ఆమె.. తాను న్యాయం కోసం ఎదురుచూస్తున్నానని దీనంగా వ్యాఖ్యానించింది. అసలు నా హక్కులేవీ అని ప్రశ్నించగా.. ‘ మీ హక్కుల గురించి ప్రతివారూ యోచిస్తున్నారని, అందుకే ఈ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయని న్యాయమూర్తి అన్నారు.
దోషికి లీగల్ ఎయిడ్ కోరే న్యాయబధ్ధమైన హక్కు ఉందని జడ్జి చెప్పగా.. ఇది తన కుమార్తెకే జరుగుతున్న అన్యాయమని నిర్భయ తండ్రి అన్నారు. కానీ ఆయనతో జడ్జి…. అది సరికాదన్నారు. దోషులైన ముకేష్, పవన్, వినయ్, అక్షయ్ లలో ఎవరూ లీగల్ ఆప్షన్ ఎంచుకోలేదని తీహార్ జైలు అధికారులు మంగళవారం ట్రయల్ కోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు.