వేట షురూ.. !పాకిస్తాన్ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నియంత్రించే హఫీజ్ సయీద్, మసూద్ అజార్ ఎక్కడ?
పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కటే మాట.. ఉగ్రవాదులను వారిని పెంచి పోషిస్తున్న పాక్‌ను శిక్షించాలని..! ఈ దాడి వెనక పాకిస్తాన్, తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబా కుట్ర బహిర్గతం కావడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రతీకార దాడులకు దిగాలంటూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో పాకిస్థాన్‌తోపాటు ఉగ్రవాద సంస్థలకు వెన్నులో వణుకుపుడుతోంది.

పహల్గామ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒక్కటే మాట.. ఉగ్రవాదులను వారిని పెంచి పోషిస్తున్న పాక్‌ను శిక్షించాలని..! ఈ దాడి వెనక పాకిస్తాన్, తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబా కుట్ర బహిర్గతం కావడంతో ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రతీకార దాడులకు దిగాలంటూ భారత ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. దీంతో పాకిస్థాన్‌తోపాటు ఉగ్రవాద సంస్థలకు వెన్నులో వణుకుపుడుతోంది.
పహల్గామ్ దాడివెనక పాక్, లష్కరే తొయిబా హస్తం ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన దర్యాప్తులో తేల్చడంతో హఫీజ్ సయీద్‌కు ప్రాణభయం పట్టుకుంది. పాకిస్తాన్‌లో ఉంటున్న హఫీజ్ ప్రాణ రక్షణకు తరచుగా నివాసాన్ని మార్చుతున్నాడు. హఫీజ్‌కు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అండగా నిలుస్తోంది. హఫీజ్‌ను ఇటీవల లాహోర్‌లోని మియాన్మెర్ కంటోన్మెంట్ ఏరియాలో కొత్త ఇంటికి తరలించింది ఐఎస్ఐ. హఫీజ్ సయీద్ దాక్కున్న కొత్త ఇంటి లొకేషన్ తమవద్ద ఉందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రకటించడంతో హఫీజ్‌కు ప్రాణభయం రెట్టింపయింది. పహల్గామ్ దాడికి ప్రతిగా హఫీజ్‌ను చంపడానికి భారత్ కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభిస్తుందని ఐఎస్ఐ భావిస్తోంది.
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత దేశం హై అలర్ట్‌లో భాగంగా, జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద గ్రూపులపై నిఘా సంస్థలు వివరణాత్మక పత్రాన్ని రూపొందించాయి. ఈ సంస్థల కమాండ్ సోపానక్రమం, నిధుల మార్గాలను వివరించింది. వాటి అగ్ర నాయకత్వం, లాంచ్ కమాండర్లు, ఆర్థిక సహాయ వనరుల గురించి క్లిష్టమైన వివరాలను వెల్లడించింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం, జైష్-ఎ-మొహమ్మద్‌లో మౌలానా మసూద్ అజార్ అత్యున్నత పదవి కలిగి ఉండి, కీలక వ్యక్తులను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. మొహమ్మద్ హసన్ సంస్థ ప్రతినిధిగా పనిచేస్తున్నాడు.
ముఖ్యమైన వ్యక్తులపై ఒక లుక్:
మౌలానా మసూద్ అజార్ – ఎమిర్ (సంస్థ అధిపతి)
మహ్మద్ హసన్ – ప్రతినిధి
మౌలానా ఖరీ మసూద్ అహ్మద్ – చీఫ్, ప్రచార విభాగం
ముఫ్తీ అస్గర్ – చీఫ్ కమాండర్, ఆపరేషన్స్
ఇబ్రహీం రాథర్ – చీఫ్, మిల్లి అఫైర్స్
మౌలానా సజ్జాద్ ఉస్మాన్ – ఫైనాన్స్ ఇంఛార్జ్ (గతంలో హర్కత్-ఉల్-ముజాహిదీన్ (HUM))
సైఫుల్లా షకీర్ – నజీమ్ RMC (అల్ రెహమత్ ట్రస్ట్ మాజీ ఇన్‌చార్జ్)
మౌలానా ముఫ్తీ మహ్మద్ అస్గర్ అలియాస్ సాద్ బాబా – లాంచ్ కమాండర్ (మాజీ హర్కత్-ఉల్-ముజాహిదీన్ సభ్యుడు)
నిఘా వర్గాల సమాచారం ప్రకారం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని ఈ ఉగ్రవాద గ్రూపులు కార్యాచరణ స్థావరాలను నిర్వహిస్తున్నాయి. ఇక్కడ భారతదేశానికి వ్యతిరేకంగా కార్యకలాపాలకు వ్యూహాలు రూపొందిస్తున్నాయి. భారతదేశంలోకి చొరబడటానికి, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వడానికి బాధ్యత వహించే ఈ సంస్థలలో లాంచ్ కమాండర్ పాత్ర చాలా ముఖ్యమైనది. మౌలానా ముఫ్తీ మొహమ్మద్ అస్గర్ అలియాస్ సాద్ బాబా జైష్ ప్రధాన లాంచ్ కమాండర్‌గా వ్యవహారిస్తున్నాడు. అతను గతంలో HUMతో సంబంధం కలిగి ఉన్నాడు. మరోవైపు హఫీజ్ మొహమ్మద్ సయీద్ – లష్కరే తోయిబా చీఫ్ క్రమంగా సంస్థ నాయకత్వ బాధ్యతలను తన కుమారుడు తల్హా సయీద్‌కు బదిలీ చేయడం ప్రారంభించాడు. అతను ఇప్పుడు దాని కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
ఇదిలావుంటే, పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా భారత్ సింధు నదీ జలాలను నిలిపివేయడంతో హఫీజ్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు. కశ్మీర్‌పై పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు. ఈ యుద్ధం కొనసాగిస్తాం.. మనం పోరాటం చేద్దాం.. కశ్మీర్ పోరాటంలో విజయం సాదిద్దాం. దక్కన్ ప్రాంతం హైదరాబాద్‌లో సైతం విజయం సాదిద్దాం.. అన్ని ప్రాంతాల్లో విజయం సాదిద్దామంటూ పాకిస్థానీయులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశాడు. ఈ క్రమంలోనే నిషేధిత లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌ను అంతం చేస్తానని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోషల్ మీడియా మాధ్యమంగా వార్నింగ్ ఇవ్వగా, మరోపక్క పాకిస్తాన్ పీచమణచడానికి తాను సిద్ధమని కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. ఇందుకు ఆత్మాహుతి బాంబునవుతానని ప్రకటించారు మంత్రి.
ఇదిలావుంటే, ఉగ్రవాదులకు, ఉగ్రాదాడులకు ఆర్థిక సహాయం చేశాడన్న కారణంగా అధికారికంగా హఫీజ్ సయీద్‌కు 46ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. అప్పటి నుంచి భారత్‌కు చిక్కకుండా పాక్‌లో దాక్కున్నాడు హఫీజ్. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం సరోగొదాలో జన్మించిన హఫీజ్ మహ్మద్ సయీద్ బాల్యం నుంచే ఖురాన్ ఔపోసన పట్టాడు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న తీవ్రవాద సంస్థ లష్కరే తొయిబా సహ వ్యవస్థాపకుడు హఫీజ్. ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో హఫీజ్ తలపై 10 మిలియన్ డాలర్ల రివార్డును అమెరికా ప్రకటించింది. పహల్గామ్ దాడితోపాటు, 2008లో ముంబయి దాడుల కేసులో సైతం 77ఏళ్ల హఫీజ్ సయీద్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్నాడు. అటు ఐక్యరాజ్యసమితితోపాటు అమెరికా ఇటు భారత్.. హఫీజ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాయి. 2009లోనే ఇంటర్‌పోల్ హఫీజ్‌ను పట్టుకోవడానికి రెడ్ కార్నర్ నోటీస్ జారీచేసింది.
మరోవైపు ఉగ్రవాదులకు నిధులందిస్తున్న కేసులో హఫీజ్‌ను తామే అరెస్ట్ చేసి జైల్లో పెట్టామంటోంది పాకిస్తాన్. ఈ వాదనలో ఎంతమాత్రం నిజం కాదని పలుమార్లు తేలిపోయింది. ఐఎస్ఐ సంస్థ హఫీజ్‌ను కంటికి రెప్పలా రక్షిస్తోందని తెలుస్తోంది. లష్కరే తొయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్ గత మూడేళ్లలో 25సార్లకు పైగా ప్రజలకు కన్పించాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పీవోకేలోని టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ దగ్గర, ముర్దికె, భావల్‌పూర్, రావల్‌కోట్ క్యాంపుల్లో కన్పించాడు. భారత్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత లష్కరే తొయిబా సంస్థను ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌గా పేరుమార్చాడు హఫీజ్ సయీద్.
కొన్నేళ్లుగా హఫీజ్‌ను భారత్‌కు అప్పగించాలని కోరుతున్నప్పటికీ పాకిస్తాన్ తిరస్కరిస్తూవస్తోంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో హఫీజ్‌ను మట్టుపెట్టడానికి భారత్ కోవర్ట్ ఆపరేషన్ చేపడుతుందని ఐఎస్ఐ భావిస్తోంది. హఫీజ్‌ను రక్షించడానికి పడరాని పాట్లు పడుతోంది. అయితే పాకిస్తాన్ గడ్డపై కార్యకలాపాలు సాగిస్తూ భారతదేశానికి ముప్పుగా పరిణమిస్తున్న ఈ ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్మూలించే ప్రయత్నాలలో భద్రతా దళాలు, నిఘా ఏజెన్సీలు సిద్ధమవుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
