AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ నుంచి ఎదో మెసేజ్.. ఓపెన్ చేసి చూడగా దెబ్బకు.. ప్రపంచంలోనే ధనవంతుడైన రైతు

ఏప్రిల్ 24న రూ.1,800, $1,400 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 25న అజిత్ ఖాతాకు 36 అంకెల సంఖ్యతో నగదు జమ అయింది. లెక్కల్లో వర్ణించలేనంత డబ్బు తన ఖాతాలో క్రెడిట్‌ అవటంతో అతడు భయపడిపోయాడు. అంత పెద్ద మొత్తాన్ని చూసిన అజిత్‌ ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

బ్యాంక్ నుంచి ఎదో మెసేజ్.. ఓపెన్ చేసి చూడగా దెబ్బకు.. ప్రపంచంలోనే ధనవంతుడైన రైతు
Up Man's Bank Balance
Jyothi Gadda
|

Updated on: May 06, 2025 | 4:43 PM

Share

రోజు వారి కూలి పనులు చేసుకునే ఒక రైతు బ్యాంకు ఖాతాలోకి అకస్మాత్తుగా కోట్లాది రూపాయలు జమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన ఖాతాలో అంత పెద్ద మొత్తాన్ని చూసిన అతను షాక్ అయ్యాడు. అంతకు ఒక్కరోజు ముందే.. తన ఖాతాలోంచి 1800 రూపాయల ఫ్రడ్‌ జరిగిందని ఆ రైతు వాపోయాడు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒకేసారి లెక్కలేనంత డబ్బు తన అకౌంట్‌లో కనిపించటంతో భయపడిపోయాడు.. వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. చివరకు ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే…

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. సాదాబాద్ తహసీల్ ప్రాంతంలోని నాగ్లా దుర్జియాలో నివసిస్తున్న అజిత్‌ అనే రైతు ఖాతాలోకి అకస్మాత్తుగా రూ.1,00,13 ,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542 జమ అయ్యాయి. దీంతో అతను తాత్కాలికంగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యాడు. ఏప్రిల్ 24న రూ.1,800, $1,400 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత ఏప్రిల్ 25న అజిత్ ఖాతాకు 36 అంకెల సంఖ్యతో నగదు జమ అయింది. లెక్కల్లో వర్ణించలేనంత డబ్బు తన ఖాతాలో క్రెడిట్‌ అవటంతో అతడు భయపడిపోయాడు. అంత పెద్ద మొత్తాన్ని చూసిన అజిత్‌ ఆశ్చర్యపోయాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఈ విషయం తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ఘటన ఆ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదు మేరకు బ్యాంకును సంప్రదించగా ఇది జమ్మూ- కశ్మీర్ బ్రాంచ్‌లో సాంకేతిక లోపం వల్ల క్రెడిట్ అయినట్టు బ్యాంకింగ్ అధికారులు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ అజిత్ బ్యాంక్ ఖాతాలో కనిపించిన మొత్తం అనేక మంది బిలియనీర్ల నికర విలువ కంటే ఎక్కువ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…