బిజెపి ‘మహా’ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు మొదలైందో తెలిస్తే షాకే..!

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నది పాత సామెత. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు.. ఐ మీన్ ఎన్నో ఫలితాలు… ఇదే ఇప్పటి ట్రెండ్. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు చూస్తే ఇదే కరెక్టనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో చివరి దాకా ఓడిపోతున్నట్లు కనిపించి.. అనూహ్యంగా విజేతగా నిలిచిన బిజెపిది ఈనాటి వ్యూహం కాదని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజం పడిందెప్పుడు? మహారాష్ట్రలో పగ్గాలు చేపట్టడంతోపాటు రాజకీయంగా చిరకాలంపాటు పైచేయి […]

బిజెపి ‘మహా’ యాక్షన్ ప్లాన్ ఎప్పుడు మొదలైందో తెలిస్తే షాకే..!
Rajesh Sharma

| Edited By: Srinu Perla

Nov 23, 2019 | 2:51 PM

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నది పాత సామెత. ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు.. ఐ మీన్ ఎన్నో ఫలితాలు… ఇదే ఇప్పటి ట్రెండ్. భారతీయ జనతా పార్టీ వ్యూహాలు చూస్తే ఇదే కరెక్టనిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో చివరి దాకా ఓడిపోతున్నట్లు కనిపించి.. అనూహ్యంగా విజేతగా నిలిచిన బిజెపిది ఈనాటి వ్యూహం కాదని రాజకీయ విశ్లేషకులు అంఛనా వేస్తున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజం పడిందెప్పుడు? మహారాష్ట్రలో పగ్గాలు చేపట్టడంతోపాటు రాజకీయంగా చిరకాలంపాటు పైచేయి కొనసాగించే విధంగా బిజెపి వేసిన ఎత్తుగడ అమలు చాలా కాలం క్రితమే మొదలైందని అంఛనా వేస్తున్నారు.

బిజెపి యాక్షన్ ప్లాన్ ఎప్పుడు మొదలైంది అన్నది రాసే ముందు.. అయిదేళ్ళ నాటి పరిణామాలను ఒక్కసారి గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం వుంది. అయిదేళ్ళ క్రితం అంటే 2014 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో బిజెపి-శివసేన మధ్య జరిగిన పరిణామాలు ఆ తర్వాత అయిదేళ్ళ పాటు రెండు పార్టీల మధ్య గ్యాప్ పెంచాయే తప్ప తగ్గలేదు. ఆనాడు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే శివసేన ఎంపీ సురేశ్ ప్రభును బిజెపి తమ పార్టీలో చేర్చుకోవడం సేన అధినాయకత్వానికి నచ్చలేదు. ఆయన్ను పార్టీలో చేర్చుకోవడమే కాకుండా ఏకంగా కేంద్ర మంత్రి పదవిని ఇవ్వడంతో ఉద్ధవ్ థాక్రే అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఫలితంగా ఆ తర్వాత నాలుగు నెలలకు జరిగిన ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. సాధారణ మెజారిటీకి కాస్త తక్కువ సీట్లనే సాధించినా బిజెపి అయిదేళ్ళపాటు రాష్ట్రంలో అధికారంలో కొనసాగింది. ఆ తర్వాత రీసెంట్ ఎన్నికల సమయంలో పైపైన చిరునవ్వులతో కలిసి తిరిగినా రెండు పార్టీల మధ్య అంతర్లీనంగా గ్యాప్ కొనసాగుతూనే వచ్చింది.

ఈ క్రమంలోనే రెండు పార్టీలు తలో వ్యూహాన్ని అనుసరించాయి. బిజెపిని తమపై ఆధార పడేలా చేసుకోవాలన్న ఎత్తుగడతో శివసేన.. కమలం పార్టీ పోటీ చేసిన స్థానాల్లో పెద్దగా సహకరించలేదు. అందుకే 150 సీట్లలో పోటీ చేసిన బిజెపి 105 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అటు బిజెపి కూడా శివసేన ఎత్తుగడను పసిగట్టింది. అందుకే ఎన్నికలకు ముందు శరద్ పవార్, అతని బంధువుల ఇళ్ళపై సిబిఐ దాడులు చేయించడం ద్వారా ఎన్సీపీకి సింపతీ పెరిగేట్లు చేసి.. పరోక్షంగా శివసేనకు సమానంగా సీట్లు పొందేలా చేసుకుంది. ఒకవేళ శివసేన పేచీ పెడితే ఎన్సీపీతో కలిసేందుకు కమలం నేతలు ఆరు నెలల క్రితమే వ్యూహం రచించినట్లు పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. అందుకే దేవేంద్ర ఫడ్నవీస్ చాలా సందర్భాలలో ధీమాగా కనిపించినట్లు భావిస్తున్నారు.

ఎన్సీపీని కలుపుకోవడంలో మరో వ్యూహం ?

ఎన్డీయేలో కొనసాగుతూనే తరచూ తలనొప్పులు తెస్తున్న శివసేనను దూరం పెట్టాలని కమలం నేతలు చాలా కాలం క్రితమే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అయితే హార్డ్ కోర్‌ హిందూ పార్టీగా వున్న శివసేనతో గట్టి కారణం లేకుండా దూరం జరిగితే అది మరెక్కడైనా ప్రభావం చూపుతుందేమోనని బిజెపి జంకింది. అందుకే నెల రోజుల డ్రామాలో శివసేనను పూర్తిగా ఎక్స్‌పోజ్ అయ్యేలా చేసి, హిందూ సమాజం కూడా శివసేన పాలిటిక్స్‌ను అసహ్యించుకునేలా చేసింది బిజెపి. కేవలం పదవి కోసమే బిజెపితో శతృత్వం పెంచుకుందని ప్రజలందరికీ అర్థమయ్యే వరకు వేచి చూశారు కమలం నేతలు. చివరికి చిరకాలంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీతో శివసేన కలిసి తన క్రెడిబిలిటీ కోల్పోయిన ఆఖరు తరుణంలో బిజెపి వేగంగా పావులు కదిపింది. రాత్రి ఎనిమిది గంటలకు మొదలైన మంతనాలను తెల్లవారుజామున 4 గంటల దాకా కొనసాగించి, ఆ తర్వాత రెండు, మూడు గంటల్లో ప్రమాణ స్వీకారం దాకా తెచ్చేశారు బిజెపి నేతలు.

అదే సమయంలో ఎన్సీపీని కలుపుకోవడంలో కూడా బిజెపి దూరదృష్టి కనిపిస్తోంది. సామ్నా ఎడిటోరియల్స్‌తో తరచూ నెత్తి నొప్పి తెప్పిస్తున్న ఎన్సీపీని వదిలించుకుని, ఎన్సీపీని కలుపుకోవడం ద్వారా ఎన్డీయేను బలోపేతం చేసుకోవడంతోపాటు.. ఫ్యూచర్‌లో యుపిఏని మరింత నీరుగార్చాలన్నది బిజెపి ద్విముఖ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి యుపిఏలో కాంగ్రెస్ పార్టీ తర్వాత అటు ఎన్సీపీ, ఇటు డిఎంకె.. రెండే పెద్ద పార్టీలు. అందులోంచి ఎన్సీపీని లాగేస్తే.. ఇక కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఏ ఇప్పుడప్పుడే కోలుకోలేదని బిజెపి నేతలు వ్యూహం పన్నారు. సో.. పక్కా వ్యూహంతో ఆర్నెళ్ళ స్కెచ్‌తో మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు జాతీయ స్థాయిలోను పలు ఫలితాలు పొందబోతోంది కమలం పార్టీ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu